NTV Telugu Site icon

Spain Floods: భారీ వరదలతో స్పెయిన్ అతలాకుతలం.. 100 మంది మృతి!

Spainfloods

Spainfloods

భారీ వరదలు స్పెయిన్‌ను అతలాకుతలం చేశాయి. గత 37 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని రీతిలో అత్యంత ఘోరంగా వరదలు హడలెత్తించాయి. ఇప్పటికే 100 మంది చనిపోగా.. వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు. భారీగా వాహనాలు గల్లంతయ్యాయి. వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఆస్తులు ధ్వంసం అయ్యాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. సరైన వసతులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: KA Success Meet: “క” సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటున్నమూవీ టీమ్

వరదలు కారణంగా దాదాపు 100 మంది చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వరదల నేపథ్యంలో స్పెయిన్‌ అత్యవసర ప్రతిస్పందన విభాగానికి చెందిన 1,000 మంది సైనికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు దక్షిణ స్పెయిన్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి వీధులు బురద నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా తప్పిపోయిన వారి ఆచూకీ కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది.