NTV Telugu Site icon

Space Debris: ఆకాశంలో ‘చెత్త’.. ప్రపంచదేశాలకు సవాల్

Space Debris

Space Debris

Space Debris Become Challege For World: మానవుడు తన స్వార్థం కోసం ఇప్పటికే భూగోళాన్ని వ్యర్థాలతో నింపేశాడు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఆకాశాన్ని కూడా ‘చెత్త’గా మార్చేశాడు. టెక్నాలజీ పరంగా ఎదిగేందుకు అంతరిక్షంలో పంపించిన శాటిలైట్లలో కొన్ని చెత్తగా మారాయి. రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం రోదసీలో 3,409 శాటిలైట్లు నిరుపయోగమై వ్యర్థాలుగా మారినట్లు తేలింది. అంతేకాదండోయ్.. రాకెట్ల నుంచి రాలిపడ్డ 34 వేల స్పేస్‌ జంక్‌ ముక్కలు (10 సెం.మీ కంటే పెద్దవి), మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి. ఇప్పటికీ ప్రపంచదేశాలు పోటీపడి మరీ శాటిలైట్లను పంపిస్తుండటంతో.. 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58 వేలకు దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. భవిష్యత్తులో స్పేస్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోవడం ఖాయం. అప్పుడు గగనతలం పెద్ద ముప్పునే ఎదుర్కోవాల్సి వస్తుంది.

Jubilee Hills Crime: మద్యం మత్తులో కారులో షికారు.. ప్రమాదం జరగడంతో పరార్

ఈ శాటిలైట్స్ పుణ్యమా అని.. మానవాళి చరిత్ర సమూలంగా మారిన విషయం తెలిసిందే! వీటి ద్వారా మనకు టీవీ, ఫోన్, ఇంటర్నెట్, జీపీఎస్‌ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాతావరణంలో వచ్చే మార్పుల్ని సైతం ముందుగానే పసిగట్టగలుగుతున్నాం కూడా! కానీ.. వరుసగా శాటిలైట్స్ పంపిస్తున్న కారణంగా ఇప్పుడు ఆకాశంలో చెత్త బాగా పేరుకుపోయింది. నిజానికి.. శాటిలైట్స్‌ను మూడు రకాల ఆర్బిట్స్‌లో ఉంచుతారు. ఒకటి, లోయర్ ఆర్బిట్ (భూమి నుంచి 300కి.మీ.).. రెండు, రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ఆర్బిట్స్ (700-1,000 కి.మీ).. మూడు, జియో సింక్రనస్‌ ఆర్బి­ట్‌ (36 వేల కి.మీ.). ప్రతి ఏటా వందల సంఖ్యలో శాటిలైట్స్‌ను పంపుతుండటంతో.. ఆ ఆర్బిట్ల మధ్య దూరం తగ్గిపోయి, స్పేస్‌ ట్రాఫిక్‌ ఏర్పడుతోంది. ఎక్కువ అంతరిక్ష శిథిలాలు 600-700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయి. నాసా లెక్కల ప్రకారం.. సాఫ్ట్‌బాల్‌ పరిమాణంలో 34 వేల స్పేస్‌ డెబ్రిస్‌ శిథిలాలు, ఒక మిల్లీమీటర్‌ కంటే పెద్ద పరిమాణంలో 128 మిలియన్ల శిథిలాలు ఉన్నాయి. ఈ అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై.. రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుషితం చేస్తున్నాయి.

Divyansha Kaushik: ఐ లవ్ నాగచైతన్య.. బాంబ్ పేల్చిన ‘మజిలీ’ బ్యూటీ

ఈ అంతరిక్ష వ్యర్థాల్లో మూడింటి ఒక భాగం అమెరికా, రష్యాలవే ఉన్నాయి. ఈ డెడ్‌ శాటిలైట్లు, రాకెట్‌ శిథిలాలను తొలగించడం ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యర్థాలను తొలగించేందుకు అమెరికా 1993లో వివిధ దేశాల స్పేస్‌ శాస్త్రవేత్తలతో ఇంటర్‌ ఏజెన్సీ స్పేస్‌ డెబ్రిస్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీని నియమించింది. ఐక్యరాజ్య సమితి 1959లోనే ‘ఔటర్‌ స్పేస్‌ శాంతియుత ఉపయోగాల కమిటీ’ని నియమించింది. ఈ కమిటీల్లోని శాస్త్రవేత్తలు.. అంతరిక్ష శిథిలాల తొలగింపుపై ఓ నివేదికను రూపొందించాయి. ఈ చెత్తను తొలగించే యంత్రాంగం ఏ దేశం వద్ద లేవు కాబట్టి.. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష్య నుంచి తప్పించి భూ వాతావరణంలోకి తెచ్చే యోచన జరుగుతోంది. నాసా అంచనా ప్రకారం.. ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది.

Show comments