నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. బుధవారం రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. ఇక గురువారం సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి వరించింది. చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ajith: అబ్బా ఏమున్నాడు బాసూ..!!
వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. వైద్య, భౌతిక, రసాయనశాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే వెల్లడించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11లక్షల స్వీడిష్ క్రోనర్ (10లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.
ఇది కూడా చదవండి: IAS Officers: ఏపీలో కొనసాగించాలని కోరిన తెలంగాణ ఐఏఎస్లకు షాక్..