Site icon NTV Telugu

Wife Kidnap Drama: బోల్తాకొట్టిన కిడ్నాప్ డ్రామా.. అడ్డంగా దొరికిన భార్య

Wife Kidnap Drama

Wife Kidnap Drama

South African Woman Arrested After Allegedly Faking Her Own Kidnapping: ‘‘నీ భార్యని మేము కిడ్నాప్ చేశాం. ఆమెని వదిలేయాలంటే, మేము అడిగినంత డబ్బు ఇవ్వాలి. లేకపోతే ఆమెను చిత్రహింసలకు గురి చేస్తాం’’ అంటూ ఒక కిడ్నాపర్ నుంచి ఓ భర్తకు ఫోన్ వచ్చింది. దాంతో భయాందోళనలకు గురైన అతడు.. ఏం చేయాలో పాలుపోక పోలీసుల్ని ఆశ్రయించాడు. కిడ్నాపర్ చేసిన ఫోన్ కాల్స్‌ని ట్రేస్ చేసి దర్యాప్తు చేయగా.. పోలీసులతో పాటు సదరు భర్త షాక్‌కి గురయ్యే ఒక ట్విస్ట్ వెలుగుచూసింది. భార్యే డబ్బుల కోసం ఈ కిడ్నాప్ నాటకం ఆడిందని తెలిసింది. దీంతో.. పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Shardul Thakur: ఏదో అనుకుంటే, ఇంకేదో జరిగింది.. శార్దూల్‌పై ఇర్ఫాన్ కామెంట్స్

భారత సంతతికి చెందిన ఫిరోజా బీ బీ జోసెఫ్ అనే 47 మహిళకు చాలా సంవత్సరాల క్రితం ఒక బిజినెస్‌మ్యాన్‌తో వివాహం అయ్యింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆ మహిళ.. తన భర్తని ప్రతీసారి డబ్బులు అడగలేక, కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. తన భర్త నుంచి భారీ డబ్బులు కాజేయాలనుకున్న ఆమె.. ఒక వ్యక్తితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడింది. మొదట ఫిరోజా తన భర్తకు కాల్ చేసి, తనని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిపింది. వాళ్లు అడిగినంత డబ్బులు ఇచ్చేసి, తనని విడిపించమని ప్రాధేయపడింది. ఆ తర్వాత కిడ్నాపర్ కాల్ చేసి.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే, నీ భార్యని టార్చర్ పెడతామంటూ బెదిరించాడు. దీంతో.. ఆ మహిళ భర్త వెంటనే పోలీసులను సంప్రదించి, తనకొచ్చిన కిడ్నాప్ కాల్ గురించి ఫిర్యాదు చేశాడు.

Samnatha: న్యూడ్ సీన్స్.. సమంత మళ్లీనా..?

మరుసటి రోజు కిడ్నాపర్ నుంచి డబ్బులు తొందరగా పంపించాలని మరో ఫోన్ కాల్ రాగా.. పోలీసులు దాన్ని ట్రేస్ చేసి, దర్యాప్తు చేశారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడినుంచి వచ్చిందో అక్కడికి వెళ్లారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. భర్త నుంచి డబ్బులు కాజేసేందుకు భార్య ఫిరోజానే ఈ కిడ్నాప్ నాటకం ఆడినట్టు తేలింది. పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ నగరంలోని ఒక హోటల్‌ గదిలో ఆమె ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. కిడ్నాపర్లు దొంగలించారన్న ఆభరణాలు కూడా ఆమె అధీనంలోనే ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా.. ఆమె ఒక హోటల్‌లో లగ్జరీగా నివసిస్తోందని కూడా తెలిసింది. దీంతో.. పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకొని, అరెస్ట్ చేశారు. భార్యే ఈ పని చేయడంతో ఆ భర్త ఖంగుతిన్నాడు.

Exit mobile version