Site icon NTV Telugu

ముష్క‌రుల చేతికి అధునాత‌న వైమానిక‌ద‌ళం… భ‌యాందోళ‌న‌లో శతృదేశాలు…

ఏకే 47, రాకెట్ లాంచ‌ర్లు ఉంటేనే ఆఫ్ఘ‌నిస్తాన్‌ను గ‌జ‌గ‌జ‌వ‌ణికిస్తున్నారు.  అదే అధుతాన ఆయుధాలు, వైమానిక ఆయుధసంప‌త్తి ముష్క‌రుల చేతికి దొరికితే ఇంకేమైనా ఉన్న‌దా… ఆఫ్ఘ‌న్ విష‌యంలో ఇప్పుడు ఇదే జ‌రిగింది. గ‌త 20 ఏళ్ల కాలంలో 89 బిలియ‌న్ డాల‌ర్లతో ఆఫ్ఘ‌నిస్తాన్‌కు అమెరికా అధునాత ఆయుధాలు, యుద్ద విమానాలు, హెలికాఫ్ట‌ర్లు, యుద్ధ ట్యాంకులు, 11 వైమానిక స్థావ‌రాల‌ను స‌మ‌కూర్చింది.  ఎలా వీటిని వినియోగించాలో సైనికుల‌ను త‌ర్ఫీదు ఇచ్చింది.  సైనిక శిక్ష‌ణ ఇచ్చింది.  ఇన్ని చేసిన‌ప్ప‌టికీ ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింది.  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు వ‌శం చేసుకున్నారు.  

Read: తాలిబ‌న్‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌: రాజ‌ధాని కాబూల్‌లో క‌ర్ఫ్యూ విధింపు…

దీంతో ఇప్పుడు ఆ అధునాత‌య ఆయుధ సంప‌త్తి మొత్తం తాలిబ‌న్ల చేతిలోకి వెళ్లాయి.  ఏ-29 తేలికపాటి పోరాట విమానాలు: 6 వేగంగా కదిలే బహుళ ప్రయోజన ‘హమ్వీ’ వాహనాలు: 174, 2.75 అంగుళాల హై ఎక్స్‌ప్లోజివ్‌ రాకెట్లు: 10వేలు,  40 ఎంఎం హై ఎక్స్‌ప్లోజివ్‌ తూటాలు: 60వేలు, పాయింట్‌ 50 క్యాలిబర్‌ తూటాలు: 9 లక్షలు, 7.62 ఎంఎం తూటాలు: 20 లక్షలు, యూహెచ్‌-60 బ్లాక్‌ హాక్స్‌: 45, ఎండీ-530: 50, ఎంఐ-17 హెలికాప్టర్లు: 56, ఏ-29 సూపర్‌ తుకానో ఫైటర్లు: 23, సి-130 హెర్క్యులస్‌ రవాణా విమానం, సి-208 విమానం, ఏసీ-208 వంటి విమానాలను అమెరికా ఆఫ్ఘ‌న్‌ల సైన్యానికి స‌మ‌కూర్చింది.  ఇప్పుడు ఇవ‌న్నీ తాలిబ‌న్ల చేతికి అందాయి. వీటిని వినియోగించ‌డం తాలిబ‌న్లు నేర్చుకుంటే ప‌రిస్థితి ఎంట‌ని శ‌తృదేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.  

Exit mobile version