నార్వే యువరాణి మెట్టే మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ(27) అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. రేప్ కేసులో హోయిబీని సోమవారం ఓస్లోలో పోలీసులు అరెస్ట్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్నవారితో సంభోగం లేదా? లైంగిక సంబంధం పెట్టుకున్నారనే ప్రాథమిక ఆరోపణలపై హోయిబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లేదంటే లైంగిక చర్యను అడ్డుకోలేదన్న కారణాలతో కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే బాధితురాలిపై లైంగిక చర్యకు పాల్పడినట్లుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ అత్యాచారం ఏ విధంగా జరిగింది అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. హాయిబీ నార్వేజియన్ సింహాసనానికి వారసుడు. అలాంటిది రేప్ కేసులో ఇరుక్కోవడం ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఇది కూడా చదవండి: Couple Relationship: వివాహిత జంటలు ఈ విషయాలను పాటించండి.. వారి జీవితంలో దూరం ఎప్పటికీ రాదు
హోయిబీపై ఆరోపణలు చేసిన బాధితురాలి వయసు 20 ఏళ్లు. హోయిబీ కూడా నేరాన్ని అంగీకరించలేదు. పోలీసుల విచారణకు మాత్రం సహకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే హోయిబీ మూడు నెలల్లో మూడుసార్లు అరెస్ట్ కావడం విశేషం. నేరపూరిత నష్టం కలిగించిన కేసులో ఆగస్టులో అరెస్ట్ అయ్యాడు. తిరిగి నిషేధాజ్ఞాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై సెప్టెంబర్‌లో మళ్లీ అరెస్ట్ అయ్యారు. మరొకసారి రేప్ కేసులో నవంబర్‌లో మళ్లీ మూడోసారి అరెస్ట్ కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Health: ఈ కూరగాయలు తింటే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.. మీరు తింటున్నారా..?