Sun Is Angry: సూర్యుడిపై వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. గత రెండు వారాల్లో సూర్యుడిపై 36 భారీ విస్పోటనాలు ( కరోనల్ మాస్ ఎజెక్షన్స్), 14 సన్ స్పాట్స్, 6 సౌర జ్వాలలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని భూమిని నేరుగా తాకగా.. మరికొన్ని భూమికి దూరంగా వెళ్లాయి. భూమిపైన సమస్త జీవరాశికి, సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలకు శక్తినిచ్చే సూర్యుడు.. ఇటీవల కాలంలో భారీ స్థాయిలో శక్తిని విడుదల చేస్తున్నాడు. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సోలార్ సైకిల్ కి దగ్గర పడే కొద్ది సూర్యుడి నుంచి భారీ స్థాయిలో శక్తి విశ్వంలోకి విడుదల అవుతుంది. అయితే సూర్యుడు ప్రస్తుతం సోలార్ సైకిల్ స్థితికి దగ్గర్లో ఉన్నాడు. 2025 నాటికి తన సోలార్ సైకిల్ ను పూర్తి చేస్తాడు. అయితే ఈ సమయంలో దగ్గర పడుతున్నా.. కొద్ధి సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు.
సోలార్ సైకిల్ అంటే..?
సూర్యుడు ప్రతీ 11 ఏళ్లకు అస్కాంత క్షేత్ర భ్రమణాన్ని పూర్తి చేస్తాడు. దీన్నే సోలార్ సైకిల్ గా పేర్కొంటారు. ఈ సమయంలో సూర్యడి అయస్కాంత క్షేత్ర ధృవాలు పరస్పరం మారుతుంటాయి. అంటే ఉత్తర ధృవం.. దక్షిణ ధృవంగా, దక్షిణ ధృవం.. ఉత్తర ధృవంగా మార్పు చెందుతుంటాయి. ఈ సమయంలో సూర్యుడిపై శక్తి భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం మార్పు పూర్తి అయిన తర్వాత మళ్లీ యథావిథిగా సూర్యుడు ప్రశాంతంగా మారుతాడు. సోలార్ సైకిల్ దగ్గర పడుతున్నా కొద్ధి సూర్యుడి నుంచి భారీ విస్పోటనాలు జరుగుతుంటాయి. వీటిని కరోనా మాస్ ఎజెక్షన్స్(సీఎంఎస్) అంటారు. వీటి నుంచి భారీ స్థాయిలో అంటే దాదాపుగా కొన్ని బిలియన్ల టన్నుల పదార్థం విశ్వంలోకి వ్యాపిస్తుంటుంది. గంటకు కొన్ని మిలియన్ మైళ్ల వేగంతో విశ్వంలో ప్రయాణిస్తుంటుంది. ఇదే సమయంలో సూర్యుడిపై కొన్ని సన్ స్పాట్స్ ఏర్పడుతుంటాయి. సన్ స్పాట్స్ అంటే ఇవి సూర్యుడి ఇతర భాగం కన్నా కొద్దిగా చల్లగా ఉండటంతో అవి కొద్ధి నల్లగా కనిపిస్తుంటాయి.
ఈ సన్ స్పాట్స్ నుంచి ఒక్కో సమయంలో భారీ స్థాయిలో సౌర జ్వాలలు ఎగిసిపడుతుంటాయి. ఇవి భూమితో పోలిస్తే కొన్ని వేల రెట్లు పెద్దవిగా ఉంటాయి. ఈ సౌర జ్వాలలు (సోలార్ ప్లేర్స్) ఒక్కోసారి భూమి వైపు గా దూసుకువస్తుంటాయి.
Read Also: Rana Daggubati: ఇన్‌స్టా పోస్టులు డిలీట్.. రానా భార్య క్లారిటీ
భూమిపై ప్రభావం..
సోలార్ ప్లేర్స్ వల్ల భూమిపై శాటిలైట్ వ్యవస్థ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), స్పేస్ లో ఉండే వ్యోమగాములు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అత్యధిక ఆవేశంతో కూడిన సోలార్ ఫ్లేర్స్ శాటిలైట్ వ్యవస్థను, కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అయితే భూమిపై ఉన్న అయస్కాంత క్షేత్రం ఈ సౌరజ్వాలలను అడ్డుకుని జీవరాశిని రక్షిస్తుంది. కానీ.. స్పేస్ లో ఉండే శాటిలైట్లపై ప్రభావం మాత్రం పడుతుంది.