Site icon NTV Telugu

US: అమెరికాలో మంచు తుఫాన్ విధ్వంసం.. లక్షలాది ఇళ్లల్లో అంధకారం

Us1

Us1

అగ్ర రాజ్యం అమెరికాను తుఫాన్ గజగజలాడిస్తోంది. గత మూడు రోజుల నుంచి కుండపోతగా మంచు కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్థం అయిపోయింది. నిత్యావసర వస్తువులు దొరకకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మంచు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 1 మిలియన్ ఇళ్లల్లో అంధకారం అలుముకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 10 వేల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అత్యవసర ప్రయాణాలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: SA20 2026 Winners: ముచ్చటగా మూడోసారి ఛాంపియన్గా సన్‌రైజర్స్..!

మంచు తుఫానులను ‘‘చారిత్రాత్మకమైనవి’’గా ట్రంప్ అభివర్ణించారు. దక్షిణ కరోలినా, వర్జీనియా, టేనస్సీ, జార్జియా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, అర్కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మిసిసిపీ, ఇండియానా, వెస్ట్ వర్జీనియాల్లో అత్యవసర విపత్తుగా ప్రకటించారు. ‘‘తుఫాను ప్రభావిత రాష్ట్రాలను మేము పర్యవేక్షిస్తూనే ఉన్నాం. అందరూ సురక్షితంగా ఉండండి’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌ మీడియాలో రాశారు.

ఇది కూడా చదవండి: Drunken Drive : SIని ఢీకొట్టి షాక్ ఇచ్చిన మందుబాబులు.. అంతటితో ఆగకుండా..!

ఇక దేశంలోని తూర్పు ప్రాంతంలో మంచు, మంచు తుఫాను, గడ్డకట్టే వర్షం, ప్రమాదకరమైన శీతల ఉష్ణోగ్రతలు సంభవిస్తాయని భవిష్య సూచకలు అంచనా వేస్తు్న్నారు. సోమవారం వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో తుపాను కొనసాగే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సర్వీసు తెలిపింది.

Exit mobile version