Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ సాహసం
- నెతన్యాహు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smit Machchhar Indian Pilot Praised by Netanyahu: గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురైనప్పటికీ, తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతీయ పైలట్‌ను ప్రశంసిస్తూ, ఆయన ధైర్యాన్ని కొనియాడారు. తన సాహసం వల్ల విమానంలోని 174 మంది ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
సెప్టెంబర్ 30న ఫ్లై దుబాయ్‌కు చెందిన FZ1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరింది. బోయింగ్ 737 MAX 8 విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో అనూహ్య పరిస్థితి ఏర్పడింది. వివరాల ప్రకారం, కో-పైలట్ కత్తితో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన పరిస్థితిని ఎదుర్కొంటూ కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. తలుపు తెరుచుకున్న వెంటనే ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ప్రయాణికులు కూడా రంగంలోకి..
కాక్‌పిట్ తలుపు తెరుచుకున్న తర్వాత ప్రయాణికులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ముందుకు వచ్చారు. వారిలో ఒకరైన యానివ్ హయూన్ దాడి చేసిన వ్యక్తిని వెనక్కి లాగి అదుపులోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ అధికారులకు వివరించారు. అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ ఫ్లై దుబాయ్ పైలట్లు కాక్‌పిట్‌లోకి వెళ్లి విమాన నియంత్రణను చేపట్టారు. విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అత్యవసర పరిస్థితి కారణంగా విమానం వేగంగా ఎత్తు కోల్పోయినట్లు ఫ్లైట్-ట్రాకింగ్ సమాచారం సూచించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
‘రియల్ హీరో’.. నెతన్యాహు ప్రశంసలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌ను ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చర్ పోరాడి, కాక్‌పిట్ తలుపు తెరిచి, ప్రయాణికులు, సిబ్బందికి జోక్యం చేసుకునే అవకాశం కల్పించారని నెతన్యాహు పేర్కొన్నారు. ఆయన చర్యలు విమానంలోని 174 మంది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా నిలిచాయని తెలిపారు. కెప్టెన్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనను ‘రియల్ హీరో’గా అభివర్ణించారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఎవరు?
స్మిత్ మచ్చర్ అనుభవజ్ఞుడైన కమర్షియల్ పైలట్. ఆయన ప్రస్తుతం దుబాయ్‌కు చెందిన ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 13 సంవత్సరాలకు పైగా కమర్షియల్ ఏవియేషన్ అనుభవం, సుమారు 9,750 గంటల విమాన ప్రయాణ అనుభవం ఉన్నట్లు భారతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అనుభవంలో ఎక్కువ భాగం బోయింగ్ 737 విమానాలపైనే ఉంది. ఫ్లై దుబాయ్‌లో చేరకముందు స్మిత్ మచ్చర్ సుమారు 11 సంవత్సరాల పాటు స్పైస్‌జెట్‌లో పనిచేశారు. అక్కడ సీనియర్ కమాండర్‌గా, అనంతరం లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా సేవలందించినట్లు సమాచారం. 2022 జూన్‌లో ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు నివేదికలు వెల్లడించాయి.
కో-పైలట్ అదుపులోకి
విమానం టబుక్‌లో ల్యాండ్ అయిన తర్వాత కెప్టెన్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్‌ను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన వెనుక ఉద్దేశం ఏమిటి? కాక్‌పిట్‌లో అసలు ఏం జరిగింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగిందా లేదా అనే విషయంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కో-పైలట్ జాతీయత ఒమన్‌కు చెందిన వ్యక్తిగా ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నప్పటికీ, అతని గుర్తింపు, ఉద్దేశం తదితర అంశాలపై పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో టెల్ అవీవ్‌కు తరలింపు
అత్యవసర పరిస్థితి కారణంగా విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో దిగిన అనంతరం ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానం ద్వారా టెల్ అవీవ్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై ముందస్తు నిర్ధారణలకు వెళ్లకుండా దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాలని ఫ్లై దుబాయ్ సూచించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ట్రంప్ కూడా పైలట్‌ను ప్రశంసించారు
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఈ ఘటన గురించి మాట్లాడినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవడం ద్వారా కెప్టెన్ మచ్చర్ కీలక పాత్ర పోషించారని ట్రంప్ ప్రశంసించారు.
Prime Minister Benjamin Netanyahu:
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker —…
— Prime Minister of Israel (@IsraeliPM) September 30, 2026
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!