
కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్ గాలిలో ఎంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఎంత తీవ్రత ఉంటుంది అనే అంశాలపై అనేక మంది అనేక సమాధానాలు ఇచ్చారు. అయితే, అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మరోసారి దీనికి సమాధానం తెలిపింది. కరోనా రోగి నుంచి వైరస్ మూడు నుంచి ఆరు అడుగుల దూరం వరకు వ్యాపించి ఉంటుందని, గాలి వెలుతురు సరిగా లేని గదిలో ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరం వరకు కరోనా వైరస్ వ్యాపిస్తుందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ పేర్కొన్నది.