ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి ఎందరో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇక ఈ ఆపరేషన్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన సింగపూర్ మహిళ వైశాలి భట్… ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయంగా ఎంటగట్టేందుకు భారత్ నుంచి ఆయా బృందాలు విదేశాల్లో తిరుగుతున్నారు. బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషి ఆధ్వర్యంలో ఓ బృందం సింగపూర్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా వైశాలి భట్.. దౌత్య బృందాన్ని కలిసింది. ఈ సందర్భంగా నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరినట్లు చెప్పింది. లేదంటే తన భర్త ప్రాణాలు కూడా పోయేవని వాపోయింది. అనంతరం పహల్గామ్ ఉగ్ర దాడి గురించి వార్తల్లో చూసి భయాందోళనలకు గురైనట్లు తెలిపింది. తాము తృటీలో తప్పించుకున్నామని.. వార్తలు చూశాక ఒళ్లు గగుర్పొడించిందని చెప్పుకొచ్చింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఆనందం వేసిందన్నారు. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన వారికి ఆపరేషన్ సిందూర్ ఒక ఊరట అని తెలిపింది. ఆపరేషన్‌కి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉందని ఆమె తెలిపింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.
ఇది కూడా చదవండి: Urine: మీ మూత్రం నుంచి నురగ, దుర్వాసన వస్తుందా? ఇన్‌ఫెక్షన్ కారకం…!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. అనంతరం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి.
