Site icon NTV Telugu

UK: యూకేలో ఘోరం.. సిక్కు యువతిపై అత్యాచారం.. నీ దేశానికి వెళ్లాలంటూ వార్నింగ్

Uk

Uk

యూకేలో దారుణం జరిగింది. 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ‘‘నీ దేశానికి తిరిగి వెళ్లిపో’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

ఇది కూడా చదవండి: PM Modi: మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోడీ

యూకేలోని ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతిపై యూకేకు చెందిన ఇద్దరు పురుషులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం యువతిని హెచ్చరిస్తూ.. మీ సొంత దేశానికి తిరిగి వెళ్లూ ఉంటూ జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటన గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో టేమ్ రోడ్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జాతి వివక్షతో కూడిన దాడిగా పరిగణించారు. లైంగిక దాడికి పాల్పడ్డ వారు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని బాధిత మహిళ తెలియజేసిందని.. సీసీటీవీ, ఫోరెనిక్స్ విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Hamas-Israel: ఖతార్‌లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!

నిందితులు బర్మింగ్‌హౌమ్‌లైవ్‌కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఒకరు తల గుండు చేయించుకుని ముదురు రంగు స్వెట్‌షర్ట్ ధరించి ఉండగా.. ఇంకొకరు బూడిత రంగు టాప్ ధరించి ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సంఘటన స్థానిక సిక్కుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఇక ఈ ప్రాంతంలో గస్తీ పెంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనను బ్రిటిష్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ తీవ్రంగా ఖండించారు. బ్రిటన్‌లో స్త్రీ ద్వేషానికి స్థానం లేదని బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్‌కు చెందిన శాసనసభ్యుడు అన్నారు.

Exit mobile version