NTV Telugu Site icon

Pakistan: పెషావర్‌లో సిక్కు వ్యక్తికి కాల్చి చంపిన దుండగులు.. రెండు రోజుల్లో రెండో ఘటన

Sikh Man Shot Dead In Pakistan

Sikh Man Shot Dead In Pakistan

Pakistan: పాకిస్తాన్ దేశంలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్టపడటం లేదు. హిందువులు, సిక్కులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ నగరంలో సిక్కు వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి రషీద్ గర్హి నుంచి పెషావర్ లోని ఇంటీరియర్ సిటీ ప్రాంతానికి వెళ్తుండగా.. గుల్దారా చౌక్ కక్షల్ సమీపంలో కొందరు సాయుధ వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గత 48 గంటల్లో ఇది రెండో ఘటన. శనివారం యక్కా టూట్ ప్రాంతంలో సిక్కు వ్యక్తిపి ఇలాగే దాడి జరిగింది. శుక్రవారం జరిగిన దాడిలో సిక్కు వ్యక్తి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. మార్చి నెలలో కూడా సిక్కు వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. ఖైబర్ ప్రావిన్సులో 15,000 మంది సిక్కులు పెషావర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎక్కువగా నగరంలోని జోగన్ షా పరిసరాల్లో నివసిస్తున్నారు. పెషావర్ నగరంలో ఎక్కువ మంది సిక్కులు వ్యాపారంలో ఉన్నారు. వీటితో పాటు ఫార్మసీలను నిర్వహిస్తున్నారు.

Read Also: Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..

గతేడాది సెప్టెంబర్ లో ప్రముఖ సిక్కు హకీమ్ (యునానీ మెడికల్ ప్రాక్టీషనర్)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2018లో, ప్రముఖ సిక్కు కమ్యూనిటీ సభ్యుడు చరణ్‌జిత్ సింగ్‌ను పెషావర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అదేవిధంగా, న్యూస్ ఛానెల్ యాంకర్ రవీందర్ సింగ్ 2020లో నగరంలో హత్యకు గురయ్యారు. 2016లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్ కూడా పెషావర్‌లో హత్య చేయబడ్డాడు.

పాకిస్తాన్ జనాభాలో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. మైనారిటీల్లో ఆ తరువాత స్థానాల్లో క్రైస్తవులు, సిక్కులు ఉన్నారు. హిందువులు కూడా పాకిస్తాన్ లో హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా సింధ్ ప్రావిన్సులో నివసిస్తున్నారు. ఇక్కడ హిందూ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చి, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహం చేస్తున్నారు.