Site icon NTV Telugu

Shocking Survey: మగాళ్లు బహుపరాక్.. తగ్గుతున్న వీర్య కణాల సంఖ్య..

Significant Decline In Sperm Counts Globally, Including India

Significant Decline In Sperm Counts Globally, Including India

Significant Decline In Sperm Counts Globally, Including India: షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణీయంగా పడపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. సంవత్సరాల తరబడి గణనీయంగా తగ్గదల కనిపించిందని అంతర్జాతీయ పరిశోధకులు బృందం గుర్తించింది. హ్యామన్ రిప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్‌లో మంగళవారం ఈ విషయాన్ని ప్రచురించింది. మొత్తం 53 దేశాల డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. 2011-2018 మధ్య ఏడు సంవత్సరాల్లో డేటాను సేకరించి వీర్యకణాల సంఖ్యపై అధ్యయనం చేశారు.

Read Also: Dog Attack: కుక్క దాడికి గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం

వీర్యకణాల సంఖ్య అనేది కేవలం సంతానోత్పత్తికి మాత్రమే కాకుండా.. అది పురుషుల ఆరోగ్యాన్ని కూడా తెలియజేస్తుందని.. తక్కువ స్థాయి స్పెర్మ్ కౌంట్ దీర్ఘకాలిక వ్యాధులు, టెస్టిక్యులర్ క్యాన్సర్, జీవితకాల తగ్గే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. పర్యావరణం, ప్రస్తుత జీవనశైలి వీర్యకణాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఇది ఇలాగే కొనసాగితే మానవమనుగడపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు ఆందోళనచెందుతున్నారు.

ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా ప్రాంతాల్లోని పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ కాన్సన్ ట్రేషన్ లో గణనీయంగా క్షీణత కనిపిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2000 తరువాత మరింత ఎక్కువైందని డేటా నిరూపిస్తోంది. భారతదేశంలో కూడా క్షీణత కనిపిస్తోందని ఇజ్రాయిల్ లోని జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హగై లెవిన్ తెలిపారు. గత 46 ఏళ్లలో 50 శాతానికి పైగా వీర్యకణాల క్షీణత కనిపిస్తుందని.. ఇటీవల సంవత్సరాల్లో ఇది వేగవంతం అయిందని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతీ ఏడాది పురుషుల వీర్యకణాల సంఖ్య, కాన్సన్ ట్రేషన్ క్షీణత 1 శాతం కన్నా ఎక్కువగా ఉంటే టెస్టిక్యులర్ క్యాన్సర్, హార్మోన్ల సమతుల్యతకు దారి తీస్తుందని పరిశోధకులు తెలిపారు.

Exit mobile version