Philippines shooting: ఫిలిప్పీన్స్‌లోని యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని మనీలాలోని యూనీవర్సిటీ క్యాంపస్ ఆదివారం మధ్యాహ్నం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి కాల్పులకు తెగబడగా.. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒక కారును తీసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించాడని కానీ పోలీసులకు పట్టుబడ్డాడని ఫిలిప్పీన్ నేషనల్ పోలీసులు తెలిపారు. విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఈ హత్యకు గురైన వ్యక్తుల్లో ఓ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డు, ఓ విద్యార్థిని ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.
Three Days …Six Deaths: మూడురోజులు.. ఆరు ప్రాణాలు బలి
అటెనియో డి మనీలా యూనివర్శిటీలో లా విద్యార్థులు, వారి కుటుంబాలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరుకావాల్సిన స్నాతకోత్సవ వేడుకకు హాజరు కావాల్సిన సమయంలో ఈ ఘటన జరిగింది. స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ గెస్ముండో హాజరు కావాల్సి ఉండగా.. కాల్పుల ఘటన తర్వాత తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కాల్పులు జరిగే సమయంలో ఆయన మార్గం మధ్యలో ఉన్నారు. వెనక్కి వెళ్లిపోమని అధికారులు ఆయనకు సూచించారు. అలాగే ఈ ఘటన తర్వాత యూనివర్సిటీని మూసివేశారు. క్యాంపస్ “ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది” అని విశ్వవిద్యాలయం తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో తుపాకీ నిబంధనలు తక్కువగా ఉన్నప్పటికీ పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల కాల్పులు చాలా అరుదు అని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు.