జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రపంచ దేశాలు సంతాపాన్ని ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయనపై మాజీ సైనికులు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మరణించాడు. ఈ ఘటన రాజధాని టోక్యోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారా నగరంలో చోటు చేసుకుంది. అయితే షింజో అబేను బతికించేందుకు డాక్టర్లు ఐదు గంటల పాటు శ్రమించినా కాపాడలేకపోయారు. జపనీస్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షింజో అబే ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా టెట్సుయా యమగామి అనే 41 ఏళ్ల దేశ నావికాదళ మాజీ సైనికుడు కాల్పులు జరిపాడు. వెనకనుంచి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే అక్కడే ఉన్న కొంతమంది షింజో అబేను బతికించే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి అబేను మధ్యాహ్నం 12.20కి నారా మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
Read Also: Hardik Pandya: అరుదైన రికార్డ్.. యువీ తర్వాత ఆ ఫీట్ సొంతం
కాల్పుల వల్ల షింజో అబే గుండెలో పెద్ద రంధ్రం ఏర్పడింది. అతడు ఆస్పత్రికి వచ్చే సరికి గుండె ఆగిపోయిన స్థితిలో ఉందని.. దాదాపు 5 గంటల పాటు కాపాడేందుకు ప్రయత్నించామని, రక్త మార్పిడి కూడా చేశామని..అయితే ఆయన్న బ్రతికించలేకపోయామని సాయంత్ర 5.30 గంటలకు మరణించాడని ఆస్పత్రి ప్రొఫెసర్ హిడెటాడా ఫుకుషిమా వెల్లడించారు. గతంలో జపాన్ నావికాదళంలో పనిచేసిని టెట్సయా యమగామి, షింజో అబే పట్ల‘అసంతృప్తి’గా ఉన్నట్లు అందుకే చంపాలని అనుకున్నట్లు జపనీస్ వార్త సంస్థలు వెల్లడించాయి. కాల్పుల అనంతరం జరిపిన సోదాల్లో అతని ఇంటి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.