Site icon NTV Telugu

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి దాడులు మొద‌ల‌య్యాయి… ర‌ష్యా ఆరోప‌ణ‌…

ర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌కు మూడు వైపులా భారీ సంఖ్య‌లో ర‌ష్యా సైన్యం మోహ‌రించింది. ఉక్రెయిన్‌కు వ్య‌తిరేంగా కొంద‌రు దేశం లోపల ప‌నిచేస్తున్నారు. ర‌ష్యా అనుకూల వేర్పాటు వాదుల‌కు, ఉక్రెయిన్ సైన్యానికి మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ర్ణ‌ణ‌లే దీనికి కార‌ణ‌మౌతున్నాయ‌ని పుతిన్ చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో ఆ దేశానికి చెందిన సైన్యం కాల్పులు జ‌రిపిన‌ట్లు ర‌ష్యా సైన్యం వెల్ల‌డించింది. రాకెట్ లాంచ‌ర్ల‌తో రాకెట్ల‌ను ప్ర‌యోగించింది. ఈ రాకెట్ల దాడిలో ర‌ష్యా ఉక్రెయిన్ బోర్డర్ ధ్వంసం అయిన‌ట్టు సైనికులు పేర్కొన్నారు.

Read: Viral: విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పిన టీచ‌ర్‌…రోడ్డుపై ఇప్పుడిలా…

ఉక్రెయిన్ నుంచి దాడులు పెరుగుతున్నాయని, కాని తాము సంయ‌మ‌నం పాటిస్తున్నామ‌ని ర‌ష్యా చెబుతున్న‌ది. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారిపోవ‌డంతో అత్య‌వ‌స‌ర శిఖ‌రాగ్ర స‌మావేశం నిర్వ‌హించేందుకు అమెరికా సిద్ద‌మైంది. ఈ శిఖరాగ్ర స‌మావేశంలో అమెరికా, ర‌ష్యా ఉన్న‌తాధికారులు పాల్గొన‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఈ శిఖ‌రాగ్ర స‌మావేశం జ‌ర‌గాలంటే ఉక్రెయిన్ బోర్డ‌ర్‌లో సైనిక చ‌ర్య‌లు చేప‌ట్ట‌కూడ‌ద‌ని అమెరికా ష‌ర‌తులు విధించింది. తాము సంయ‌మ‌నం పాటిస్తామని, కానీ, ఉక్రెయిన్ నుంచి దాడులు జ‌రుగుతున్నాయ‌ని ర‌ష్యా ఆరోపిస్తున్న‌ది.

Exit mobile version