NTV Telugu Site icon

Terrifying incident: ప్రియుడి కోసం 5000 కిలోమీటర్లు ప్రయాణించింది.. చివరకు అవయవాల కోసం హత్యకు గురైంది

Peru Incident

Peru Incident

She Flew to Peru for Love—and Was Allegedly Killed for Her Organs: ఆన్‌లైన్‌లో పరిచయం అయిన అబ్బాయి కోసం ఏకంగా 5000 కిలోమీటర్లు ప్రయాణించింది. తాను ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉంటానని అనుకుంది.. కానీ చివరకు అత్యంత దారుణంగా హత్యకు గురైంది ఓ మహిళ. ప్రేమించిన వ్యక్తే అత్యంత ఘోరంగా మహిళను హతమార్చాడు. ఈ విషాదకర ఘటన లాటిన్ అమెరికా దేశం అయిన పెరూలో చోటు చేసుకుంది. మహిళ అవయవాల కోసం అత్యంత దారుణంగా శరీరాన్ని కోసేసి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని పెరు సముద్ర తీరంలో నవంబర్ 9న కనుక్కున్నారు.

మెక్సికోకు చెందిన 51 యువతి జూలై నెలఖరులో బ్లాంకా అరెల్లానో విహారయాత్ర కోసం పెరూలోని లిమాకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెప్పింది. ఆమె గత కొన్ని నెలలుగా పెరూ దేశానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తి జువాన్ పాబ్లో జీసస్ విల్లాఫుర్టేను ఆన్‌లైన్‌లో పరిచయాన్ని కొనసాగిస్తోంది. అయితే అతనితో లవ్ లో పడిన బ్లాంకా, అతడిని కలుసుకునేందుకు మెక్సికో నుంచి పెరూ వెళ్లింది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఉండే బీచ్ సిటీ ఆఫ్ హువాచోను వెళ్తున్నట్లు ఆమె కుటుంబానికి చివరిసారిగా నవంబర్ 7న చెప్పింది. అదే ఆమె చివరి కాల్.

Read Also: Amit Shah: చరిత్రను తిరిగరాయండి.. మిమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తా..?

ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా బ్లాంకా నుంచి ఎలాంటి సమాధానం లేదు. చివరి సారిగా నవంబర్ 7న తన అత్తతో మాట్లాడినట్లు బ్లాంకా మేనకోడులు కార్లా అరెల్లానో వెల్లడించింది. ఆ సమయంలో ఆమె ప్రేమలో ఉందని.. ఆమె సంబంధం బాగానే ఉందని బ్లాంకా, కార్లాతో చెప్పినట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే.. తన అత్త ఆచూకీ రెండు వారాలుగా తెలియకపోవడంతో ట్విట్టర్ ద్వారా ఆమెను గుర్తించాలని మేన కోడలు కార్లా అరెల్లానో కోరింది. ఆమె ట్వీట్ తో పోలీస్ విచారణ ప్రారంభం అయింది. ‘‘ నా అత్త, బ్లాంకా ఓలివియా అరెల్లానో గుటిరేజ్, నవంబర్ 7 నుంచి పెరూలో అదృశ్యమయ్యారు, ఆమె మెక్సికోకు చెందినది.. ఆమె ప్రాణాల కోసం భయపడుతున్నాం’’ ఆమెను వెతకాల్సిందిగా ట్విట్టర్ ద్వారా కోరారు.

కాగా, పెరూ సముద్ర తీరంలో అత్యంత భయానక స్థితిలో బ్లాంకా అరెల్లానో శవం లభించింది. స్థానిక మత్య్సకారుడు ముందుగా ఆమె శవాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆమె శరీరం దాదాపుగా ఛిద్రం అయి, శరీరంలోని అవయవాలు మాయం అయ్యాయి. శరీర అవయవాల కోసమే ఆమెను లవరే అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 17 జువాన్ పాబ్లోను పోలీసుల అరెస్ట్ చేశారు.

Show comments