NTV Telugu Site icon

Benjamin Netanyahu: ‘‘మా నాన్నను చంపారు’’.. నెతన్యాహూ‌కి అవమానం..

Benjamin Netanyahu

Benjamin Netanyahu

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రసంగాన్ని హమాస్ ఉగ్రదాడిలో బాధితులుగా ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. అక్టోబర్ 07 నాటి జరిగిన దాడి సంస్మరణ సభ సందర్భంగా నెతన్యాహూ స్పీచ్‌కి అంతరాయం కలిగించారు. నెతన్యాహూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నంత సేపు మౌనంగా కదలకుండా నిలబడి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Read Also: AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు పోస్టింగులు.. ఆమ్రపాలి పోస్ట్ ఇదే

‘‘నా తండ్రి హత్యకు గురయ్యాడు’’ అని ఆందోళనకారుల్లో ఒకరు నినాదాలు చేయగా.. మరొకరు ‘‘మీకు అవమానం’’ అంటూ నినాదాలు చేశారు. గతేడాది అక్టోబర్ 07న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చారు. అయితే, ఈ ఘటనకు పీఎం నెతన్యాహూ బాధ్యుడిగా చేస్తున్నారు. హమాస్ దాడిని పసిగట్టడంలో నెతన్యాహూ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పూర్తిగా విఫలమైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు బందీలగా ఉన్న వారి కుటుంబీలకు హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇజ్రాయిల్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోసారి చర్చలు జరిపేందుకు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ చీఫ్ డేవిడ్ బర్నియా దోహా వెళ్లాల్సి ఉంది. ఈ నెల ప్రారంభంలో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ హత్య తర్వాత, ఇజ్రాయిల్-హమాస్ ఒక పరిష్కారానికి రావాలని ఒత్తిడి పెరుగుతోంది. అంతకుముందు, ఖతార్ మరియు ఈజిప్ట్ ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య సంధి చర్చలకు మధ్యవర్తిత్వం వహించాయి.

Show comments