Shakira Tax Fraud Case: సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ సింగర్ షకీరా ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలున్నాయి. 2012 – 2014 మధ్యకాలంలో సంపాదించిన ఆదాయానికి సంబంధించి 14.5 మిలియన్ యూరోల పన్నులు చెల్లించడంలో విఫలమైనందున 2018లో స్పానిష్ ప్రాసిక్యూటర్లు ఆమెపై అభియోగాలు మోపారు. ప్రముఖ పాప్ సింగర్ అయిన షకీరాకు స్పెయిన్‌లో ఎనిమిదేళ్లకు పైగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పన్ను మోసం కేసును మూసివేయడానికి స్పానిష్ ప్రాసిక్యూటర్ల నుండి వచ్చిన పరిష్కార ప్రతిపాదనను షకీరా తిరస్కరించింది. బదులుగా ఆమె విచారణకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీంతో షకీరాకు ఎనిమిదేళ్లకు పైగా జైలుశిక్ష విధించాలంటూ బార్సిలోనా కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆమెపై విచారణకు ఓ తేదీని నిర్ణయించాల్సి ఉంది. 2012-2014 మధ్యలో స్పెయిన్‌లో షకీరా సంపాదించిన ఆదాయంపై చెల్లించాల్సిన 14.7 మిలియన్ డాలర్లకు సంబంధించిన పన్ను విషయంలో ఈ వివాదం రాజుకొంది.
Health Warning: ‘పొగాకు వాడేవారు పోతారు’.. కేంద్రం కొత్త ఆరోగ్య హెచ్చరిక జారీ
కొలంబియాకు చెందిన షకీరా స్పెయిన్ ఫుట్ బాల్ ఆటగాడు జెరార్డ్ పిక్‌తో సహజీవనం చేసింది. 12 ఏళ్ల పాటు కలిసున్న వీరిద్దరూ ఇటీవలే విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిక్‌తో అఫైర్ సందర్భంగా షకీరా తన మకాంను స్పెయిన్‌కు మార్చింది. 45 ఏళ్ల ఆమె తన 2010 ఫుట్‌బాల్ ప్రపంచకప్ గీతం ‘వాక వాక’ను ప్రచారం చేసుకునే సమయంలో జెరార్డ్‌ను కలిసింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.. సాష, మిలాన్ ఉన్నారు.
