NTV Telugu Site icon

Australia: పార్లమెంట్‌లోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను: ఆస్ట్రేలియా సేనేటర్

Australia

Australia

Australia: మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. అలాగే మహిళా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వేధింపులు తప్పడం లేదు. ఈ మధ్య జరుగుతున్న ఘటనలను చూస్తుంటే సాధారణ మహిళ నుంచి పార్లమెంటులో సభ్యులుగా ఉన్న వారికి కూడా ఈ లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పార్లమెంటు సభ్యురాలు లిడియా థోర్ప్ పార్లమెంటు భవనంలోనే తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 14న పార్లమెంట్‌లో తన సహోద్యోగి కన్జర్వేటివ్ సెనేటర్ డేవిడ్ వాన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని థోర్ప్ ఆరోపించారు.

Read also: Malavika Mohanan: మాళవిక సైడ్ యాంగిల్.. బోల్డ్ గా ఆ స్పాట్ చూపిస్తూ రచ్చ

మహిళలు పని చేయడానికి ఈ భవనం(ఆష్ట్రేలియా పార్లమెంటు) అంత సురక్షితమైన స్థలం కాదని లిడియా పేర్కొన్నారు. విక్టోరియాకు సేనేటర్‌గా ఉన్న లిడియా థోర్ప్ సెనేట్‌లో ప్రసంగిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన తోటి సెనేటర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లిడియా థోర్ప్ ఆరోపించారు. తనను మెట్ల దారిలో మూలకు వెళ్లేలాగా చేసి.. తనను అనుచితంగా తాకినట్లు చెప్పారు. పార్లమెంటులో తన వ్యాఖ్యలను బలవంతంగా ఉపసంహరించుకోవడానికి ముందు ఆమె ఈ కామెంట్స్ చేశారు. లిబరల్ పార్టీ డేవిడ్ వాన్‌ ఆమె ఈ ఆరోపణలు చేశారు.

Read also: Ashu Reddy : తన బ్యూటీ పై బోల్డ్ కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!

తాను అనుభవించి చెప్పానని తెలిపారు. తాను పార్లమెంట్‌ భవనం నుంచి బయటికి నడవడానికి భయపడ్డానని.. కొంచెం తలుపు తెరిచి, బయటికి వెళ్లే ముందు అంతా సక్రమంగా ఉందో లేదో తనిఖీ చేసుకొని వెళతానని చెప్పారు. ఈ భవనం లోపలికి వచ్చే ప్రతిసారి తనతో పాటు ఎవరైనా ఉండవలసి వచ్చిందన్నారు. ఇలాంటి విషయాలను గతంలోనూ అనుభవించినప్పటికీ వారి కెరీర్ ప్రయోజనాల కోసం చెప్పలేదని.. తన లాగే ఇతరులు కూడా ఉన్నారని తనకు తెలుసునని లిడియా థోర్ప్ చట్టసభ సభ్యులకు చెప్పారు. అయితే థోర్ప్ వాదనలను డేవిడ్ వాన్‌ తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలతో తాను మానసికంగా దెబ్బతిన్నానని చెప్పారు. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్థానిక మీడియాకు తెలిపారు. ఈ ఆరోపణలపై డేవిడ్ వాన్‌‌ను లిబరల్ పార్టీ గురువారం సస్పెండ్ చేసింది. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాకపోవడం గమనార్హం.