మయమ్మార్ దేశంలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొన్నది. ఆరు నెలల క్రితం సైన్యం ఆధికారాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సమస్య ప్రారంభం అయింది. ప్రజలు సైన్యంపై తిరుగుబాటు చేయడంతో సైనిక ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ పై నిషేదం విధించింది. ఇంటర్నెట్‌ను డౌన్ చేసింది. డిజిటల్ పేమెంట్స్ లేకపోవడంతో డబ్బు కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంల వద్ద తెల్లవారుజాము 3 గంటల నుంచే క్యూలు కడుతున్నారు. ఏటీఎం లలో నిత్యం నగదును నింపుతున్నప్పటికీ సరిపోవడంలేదు. పైగా విత్‌డ్రా లిమిటేషన్ విధించడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. డాలర్‌తో మయన్మార్ కరెన్సీ విలువ 20 శాతం పడిపోయింది. డిజిటల్ చెల్లింపులు లేకపోవడంతో కొంతమంది ఏజెంట్లు 10 నుంచి 20 శాతం కమీషన్ తీసుకొని డబ్బులు ఇస్తున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే మయన్మార్ ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు.
Read: ఆ ప్రాంతాలనుంచి వచ్చే వారిపై నిషేదం… కోడ్ మారితేనే అనుమతి…
