Site icon NTV Telugu

Heavy Rains: దక్షిణ కొరియా రాజధానిలో వర్ష బీభత్సం.. దెబ్బతిన్న 2,682 భవనాలు

Record Rains In South Korea

Record Rains In South Korea

Heavy Rains: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షం వరదలకు కారణమైంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా 2,682 భవనాలు, అపార్ట్‌మెంట్లు జలమయం కావడంతో కనీసం 600 మంది నిరాశ్రయులయ్యారు. 20,000కు పైగా పశువులు చనిపోయాయి. చాలావరకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ వర్షాల వల్ల నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. సెంట్రల్ డిజాస్టర్ అండ్ సేఫ్టీ కౌంటర్‌మెజర్స్ హెడ్‌క్వార్టర్స్ ప్రకారం.. తొమ్మిది మంది మరణించగా.. 17 మంది గాయపడ్డారు. ఏడుగురు వ్యక్తులు తప్పిపోయారు. సియోల్, జియోంగ్గి, గాంగ్వాన్‌లో అధికంగా నష్టం జరిగింది. . జియోంగ్గిలో 85 మంది, ఇంచియాన్‌లో 44 మంది, గాంగ్వాన్‌లో తొమ్మిది మంది, సియోల్‌లో ఏడుగురు సహా దాదాపు 145 మందిని అధికారులు రక్షించారు.

Lanka villages: ముంపే కాదు ముహూర్తాలు ముంచుకొస్తున్నాయి.. లంక గ్రామాల్లో పెళ్లి కష్టాలు..!

1,200 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి తాత్కాలికంగా సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. వరదల కారణంగా దాదాపు 988 మంది తమ ఇళ్లను కోల్పోయారు. ప్రస్తుతం 1,471 మంది కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాలలు, విలేజ్ హాళ్లు, వసతి గృహాలు వంటి తాత్కాలిక సౌకర్యాలలో ప్రజలు ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. కొరియా డిజాస్టర్ రిలీఫ్ అసోసియేషన్, రెడ్‌క్రాస్ బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాయి. విపత్తు సహాయ విరాళానికి మద్దతుగా ప్రభుత్వం ప్రస్తుతం డిజాస్టర్ రిలీఫ్ అసోసియేషన్ వంటి సంబంధిత సంస్థలతో చర్చలు జరుపుతోంది. దాదాపు 67 మంది కుటుంబీకులు, బంధువుల ఇళ్లకు తరలివెళ్లారు. మొత్తం 600 మంది నిరాశ్రయులు కాగా.. అందులో సియోల్‌లో 230 మంది, ఇంచియాన్‌లో 9 మంది, జియోంగ్గిలో 361 మందికి ఆశ్రయం లేకుండా పోయింది.

 

Exit mobile version