Russia: రష్యాలో కారు బ్లాస్ట్.. రష్యన్ లెఫ్టినెంట్ జనరల్ మృతి
- మాస్కోలో కారు బ్లాస్ట్
- సీనియర్ రష్యన్ లెఫ్టినెంట్ జనరల్ మృతి
- ఉక్రెయిన్‌పై రష్యన్ అధికారుల అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలోని దక్షిణ మాస్కోలో కారు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో సీనియర్ రష్యన్ లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ ప్రాణాలు కోల్పోయారు. కారు కింద ఒక పేలుడు పరికరం ఉండడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఏదైనా ఉందా? అన్న కోణంలో రష్యన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
దక్షిణ మాస్కోలో సోమవారం ఒక సీనియర్ రష్యన్ సైనిక అధికారి తన కారు కింద పేలుడు పరికరం పేలి మరణించారని రష్యన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సైనిక వ్యక్తులపై జరుగుతున్న ఉన్నత స్థాయి దాడుల్లో ఇదొక సంఘటన అని పేర్కొన్నారు. హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ నిఘా వర్గాల ద్వారానే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నట్లు దర్యాప్తు కమిటీ అధికారిక ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో అన్నారు.
Also Read
- India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
- Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
ప్రాథమిక నివేదిక ప్రకారం.. మాస్కోలోని యాసెనెవో జిల్లాలో వాహనం కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే పేలిపోయింది. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరం కారణంగా ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సర్వరోవ్ అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సైన్యాధికారి మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు నెలకొననున్నాయి.
తాజావార్తలు
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!