ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రుల మార్పిడి ఆట సాగుతోంది. ఎప్పుడు.. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారారంటే ఫ్రాన్స్‌లో ఏం జరుగుతుందో ఈపాటికే అర్థమైంటుంది. నెలరోజుల క్రితమే సెబాస్టియన్ లెకోర్ను (39) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం కేబినెట్ ఏర్పాటు చేసిన కొన్ని గంటలకే లెకోర్ను ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మద్దతుదారులు బెదిరించడంతో ప్రధాని పదవికి లెకోర్ను రాజీనామా చేశారు. మళ్లీ కొత్త వ్యక్తి వస్తారనుకుంటే మాక్రాన్ షాకిచ్చారు. లెకోర్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సన్నిహితుడు. తిరిగి నాలుగు రోజుల తర్వాత కూడా తిరిగి లెకోర్నును ప్రధానిగా నియమించారు. ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Hardik Pandya: మళ్ళీ ప్రేమలో పడిన హార్దిక్ పాండ్యా..? కొత్త లవర్ ఎవరో తెలుసా..?
మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు కొత్త ముఖం కోసం ఆశించాయి. కానీ తిరిగి మరొకసారి లెకోర్ను వైపే మాక్రాన్ మొగ్గుచూశారు. రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దాలని మాక్రాన్ ఆకాంక్షించారు. అయితే పున:నియామకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్రపక్షాలు సహకరించే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. మళ్లీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది నుంచి ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. హంగ్ పార్లమెంట్‌తో కారణంగా ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మళ్లీ లెకోర్ను పునఃనియమించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మళ్లీ ఏమవుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Hamas: గాజాపై విదేశీయుల ఆదిపత్యం అంగీకరించం.. హమాస్ కీలక ప్రకటన
