NTV Telugu Site icon

SCO Summit: మోదీ, జిన్ పింగ్ మధ్య నో స్మైల్, నో షేక్ హ్యాండ్.. పక్కపక్కన ఉన్నా పట్టించుకోలేదు.

Sco Summit

Sco Summit

SCO Summit: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌ వేదికగా షాంఘై సహకార సంస్థ(ఎస్ సీ ఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. అయితే ప్రపంచ అగ్ర రాజ్యాలైన చైనా, ఇండియా, రష్యా దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సభ్య దేశాల మధ్య సహాయసహకరాల, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అయితే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య సమావేశం ఉంటుందా..? లేదా..? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇరు నేతల మధ్య సమావేశం ఉంటుందని కానీ..ఉండదని కానీ భారత విదేశాంగ శాఖ ఏది చెప్పలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాత్రం ప్రధాని నరేంద్రమోదీ సమావేశం ఉండనుంది.

అయితే 2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా భారత్, చైనా దేశాలు ఒకే వేదికను పంచుకుంటున్నాయి. అయితే వీరిద్దరి మధ్య సమావేశంపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో మాత్రం ఇరు నేతలు దూరం దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ గురువారం సాయంత్రం డిన్న మీటింగ్ కు దూరమయ్యారు. శుక్రవారం ఉదయం సమర్ కండ్ చేరుకున్నారు. అయితే ఫోటో- ఆప్ సమయంలో ఇరు నేతలు పక్కపక్కనే ఉన్నా కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ.. చిరునవ్వులతో పలకరించుకోవడం కానీ చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాకిస్తాన్ పీఎం షహజాబ్ షరీఫ్ తో పాటు టర్కీ, కజకిస్తాన్, తర్క్ మెనిస్తాన్, కిర్గజ్ స్తాన్ మొదలగు దేశాల నేతలు హాజరయ్యారు.

Read Also: Gautham Vasudev Menon: చైతన్య- సమంతను మళ్లీ కలుపుతాడట..?

అయితే వచ్చే ఏడాది భారత్ లో జరిగే ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి చైనా మద్దతు ఇస్తుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. 2020లో లడఖ్ స్టాండప్ తరువాత చైనా, ఇండియా దేశాధినేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ, పుతిన్ తో సమావేశం కానున్నారు. వీరి మధ్య వాణిజ్యం, రష్యా నుంచి ఎరువుల దిగుమతి, ఆహార సరఫరా వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. దీంతో పాటు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోవ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

కోవిడ్19 మహమ్మారి, ఉక్రెయిన్ యుద్దం కారణంగా ఆహారం, ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రాంతీయంగా మెరుగైన కెన్టివిటీపై దృష్టిపెట్టాలని భారత ప్రధాని మోదీ ప్రసంగించారు. భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ప్రతీ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని.. దేశంలో 70 వేలక కన్నా ఎక్కువ స్టార్టప్స్, 100 యునికార్న్‌లు ఉన్నాయి అని ఆయన అన్నారు.