NTV Telugu Site icon

Oxygen-28: ఆక్సిజన్ కొత్త రూపాన్ని కనుగొన్న సైంటిస్టులు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Oxygen 28

Oxygen 28

Oxygen-28: శాస్త్రవేత్తలు ఆక్సిజన్ కొత్త రూపాన్ని ‘ఆక్సిజన్-28’ని కనుగోన్నారు. ఆక్సిజన్ అణువు కేంద్రకంలో ఇప్పటి వరకు చూసిన దాని కన్నా ఎక్కువ న్యూట్రాన్లను కలిగి ఉంది. జపాన్ లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికి చెందిన అణు శాస్త్రవేత్త యోసుకే కోండో నేతృత్వంలోని సైంటిస్టుల బృందం ఆక్సిజన్-28ని కనుగొంది.

ఆక్సిజన్ అణువు కేంద్రకంలో ఇప్పటి వరకు చూసిన అత్యధిక సంఖ్యలో న్యూట్రాన్లు ఈ ఆక్సిజన్-28 కలిగి ఉంది. ఇది ఇప్పటి వరకు చూసిన ఆక్సిజన్ రూపాల్లో భారీదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆక్సిజన్ -28 అనూహ్యంగా అధిక న్యూట్రాన్-టూ-ప్రోటాన్ నిష్పత్తిని కలిగి ఉంది, ఇది చాలా అరుదు.

Read Also: chandrayaan-3: చంద్రుడిపై భారీ అగ్నిపర్వతాలు ఉండేవా..? ప్రజ్ఞాన్ గుర్తించిన మూలకాలు ఏం చెబుతున్నాయి..?

పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్లు కలిగిన న్యూక్లియాన్ అనే సబ్‌అటామిక్ పార్టికల్స్ ఉన్నాయని పరిశోధకులు బృందం చెబుతోంది. ఒక మూలకం యొక్క అటామిక్ నెంబర్ ప్రోటాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. న్యూట్రాన్ల సంఖ్య మాత్రం మారవచ్చు. న్యూట్రాన్ల సంఖ్య ఆ మూలకం యెక్క ఐసోటోపులను ఏర్పరుస్తుంది. ఆక్సిజన్ 8 ప్రోటాన్లను కలిగి ఉంటుంది, అయితే న్యూట్రాన్ల సంఖ్య వేరుగా ఉండొచ్చు.

అంతకుముందు సైంటిస్టులు ఆక్సిజన్-26ని కనుగొన్నారు. దీనిలో 8 ప్రోటాన్లు ఉంటే 18 న్యూట్రాన్లు మొత్తం న్యూక్లియాన్ 26కి సమానం. అయితే తాజాగా కనుగొన్న ఆక్సిజన్-28లో ప్రోటాన్లు 8, న్యూట్రాన్లు 20 ఉన్నాయి. సాధారణంగా భూమిపై ఉండే, మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్, ఆక్సిజన్-16 రూపంలో ఉంటుంది.

Show comments