Anti-Ageing Drug: వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి, జీవిత కాలాన్ని పెంచే ఔషధం.. అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..
- వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి.. జీవిత కాలాన్ని పెంచే ఔషధం..
- ఎలుకలపై పరిశోధన చేసి.. డ్రగ్‌ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Ageing Drug: సమీప భవిష్యత్తులో మనుషుల జీవిత కాలాన్ని పెంచే ఔషధాలకు సంబంధించిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ప్రయోగశాలలో ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వృద్ధాప్యాన్ని తగ్గించడంతో పాటు దాని జీవిత కాలాన్ని 25 శాతం పొడగించిన ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం ఈ ఔషధం ఆశలు రేపుతోంది. ‘‘సూపర్ మోడల్ గ్రానీస్’’గా పిలుస్తున్న ఈ ఔషధం కారణంగా ఎలుకలు పూర్తి యవ్వనంగా, ఆరోగ్యంగా బలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం ఈ డ్రగ్‌ని మానవులపై పరీక్షిస్తున్నారు, అయితే ఇది వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుందా..? లేదా..? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
MRC లేబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇంపీరియల్ కాలేజ్ లండన్ మరియు సింగపూర్‌లోని డ్యూక్-NUS మెడికల్ స్కూల్ పరిశోధకులు ‘ఇంటర్‌లుకిన్-11’ అనే ప్రోటీన్‌పై పరిశోధనలు జరిపారు. దీని స్థాయిలు వయసును పెంచుతుంది, ఇది ఏజ్‌ని కంట్రోల్ చేసే పలు రకాల జీవక్రియలను ప్రేరేపిస్తుంది. పరిశోధకులు మొదట జన్యుపరంగా ఇంజినీరింగ్ చేసిన ఎలుకలు ఇంటర్‌లుకిన్ -11 ఉత్పత్తి చేయలేక పోయారు. రెండవ ప్రయోగంలో, వారు ఎలుకల వయస్సు 75 వారాల వరకు (సుమారు 55 ఏళ్ల మానవునికి సమానం) చేరిన తర్వాత వాటి శరీరాల నుండి ఇంటర్‌లుకిన్ -11 ను తొలగించడానికి క్రమం తప్పకుండా ఔషధాన్ని అందించారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
Read Also: Nani- Janhvi Kapoor: వామ్మో జాన్వీ మా హీరో పక్కన వద్దు బాబోయ్!
నేచర్ జర్నల్ ప్రచురించిన ఫలితాల ప్రకారం.. ఎలుక జీవిత కాలం 20-25 శాతం పెరిగినట్లు తేలింది. అంతకుముందు ప్రయోగంలో ఎలుకలు తరుచూ క్యాన్సర్లతో మరణిస్తే, ఇంటర్‌లుకిన్-11 లేని ఎలుకలు తక్కువ స్థాయిలో వ్యాధిని కలిగి ఉన్నాయని తేలింది. మెరుగైన కండరాలు, పనితీరును ప్రదర్శించినట్లుగా తేలింది. అయితే, ఇది మానవుల్లో ఎంతమేర సక్సెస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ శరీరం ప్రారంభ సమయంలో ఇంటర్‌లుకిన్-11 చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత జీవితంలో ఏజింగ్‌కి దారి తీస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఇంటర్‌లుకిన్-11ని లక్ష్యంగా చేసుకున్న ఔషధాన్ని ప్రస్తుతం ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ఉన్న రోగులలో ట్రయల్ చేయబడుతోంది. ట్రయల్స్ పూర్తికాకున్నప్పటికీ ఈ డ్రగ్ తీసుకోవడం సురక్షితమే అని డేటా సూచిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. అవయవ మార్పిడి తిరస్కరణను నివారించడానికి ఉపయోగించే టైప్-2 డయాబెటిస్ డ్రగ్ మెట్ఫార్మిన్ మరియు రాపామైసిన్ అనే మందులు, వృద్ధాప్య వ్యతిరేక లక్షణాల కోసం పరిశోధించబడుతున్నాయి.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!