NTV Telugu Site icon

Anti-Ageing Drug: వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి, జీవిత కాలాన్ని పెంచే ఔషధం.. అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..

Supermodel Grannies

Supermodel Grannies

Anti-Ageing Drug: సమీప భవిష్యత్తులో మనుషుల జీవిత కాలాన్ని పెంచే ఔషధాలకు సంబంధించిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ప్రయోగశాలలో ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వృద్ధాప్యాన్ని తగ్గించడంతో పాటు దాని జీవిత కాలాన్ని 25 శాతం పొడగించిన ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం ఈ ఔషధం ఆశలు రేపుతోంది. ‘‘సూపర్ మోడల్ గ్రానీస్’’గా పిలుస్తున్న ఈ ఔషధం కారణంగా ఎలుకలు పూర్తి యవ్వనంగా, ఆరోగ్యంగా బలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం ఈ డ్రగ్‌ని మానవులపై పరీక్షిస్తున్నారు, అయితే ఇది వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుందా..? లేదా..? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

MRC లేబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇంపీరియల్ కాలేజ్ లండన్ మరియు సింగపూర్‌లోని డ్యూక్-NUS మెడికల్ స్కూల్ పరిశోధకులు ‘ఇంటర్‌లుకిన్-11’ అనే ప్రోటీన్‌పై పరిశోధనలు జరిపారు. దీని స్థాయిలు వయసును పెంచుతుంది, ఇది ఏజ్‌ని కంట్రోల్ చేసే పలు రకాల జీవక్రియలను ప్రేరేపిస్తుంది. పరిశోధకులు మొదట జన్యుపరంగా ఇంజినీరింగ్ చేసిన ఎలుకలు ఇంటర్‌లుకిన్ -11 ఉత్పత్తి చేయలేక పోయారు. రెండవ ప్రయోగంలో, వారు ఎలుకల వయస్సు 75 వారాల వరకు (సుమారు 55 ఏళ్ల మానవునికి సమానం) చేరిన తర్వాత వాటి శరీరాల నుండి ఇంటర్‌లుకిన్ -11 ను తొలగించడానికి క్రమం తప్పకుండా ఔషధాన్ని అందించారు.

Read Also: Nani- Janhvi Kapoor: వామ్మో జాన్వీ మా హీరో పక్కన వద్దు బాబోయ్!

నేచర్ జర్నల్ ప్రచురించిన ఫలితాల ప్రకారం.. ఎలుక జీవిత కాలం 20-25 శాతం పెరిగినట్లు తేలింది. అంతకుముందు ప్రయోగంలో ఎలుకలు తరుచూ క్యాన్సర్లతో మరణిస్తే, ఇంటర్‌లుకిన్-11 లేని ఎలుకలు తక్కువ స్థాయిలో వ్యాధిని కలిగి ఉన్నాయని తేలింది. మెరుగైన కండరాలు, పనితీరును ప్రదర్శించినట్లుగా తేలింది. అయితే, ఇది మానవుల్లో ఎంతమేర సక్సెస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ శరీరం ప్రారంభ సమయంలో ఇంటర్‌లుకిన్-11 చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత జీవితంలో ఏజింగ్‌కి దారి తీస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఇంటర్‌లుకిన్-11ని లక్ష్యంగా చేసుకున్న ఔషధాన్ని ప్రస్తుతం ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ఉన్న రోగులలో ట్రయల్ చేయబడుతోంది. ట్రయల్స్ పూర్తికాకున్నప్పటికీ ఈ డ్రగ్ తీసుకోవడం సురక్షితమే అని డేటా సూచిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. అవయవ మార్పిడి తిరస్కరణను నివారించడానికి ఉపయోగించే టైప్-2 డయాబెటిస్ డ్రగ్ మెట్‌ఫార్మిన్ మరియు రాపామైసిన్ అనే మందులు, వృద్ధాప్య వ్యతిరేక లక్షణాల కోసం పరిశోధించబడుతున్నాయి.

Show comments