NTV Telugu Site icon

Supernova: విశ్వంలో భారీ నక్షత్రం పేలుడు.. “సూపర్ నోవా”ను గుర్తించిన జపాన్ శాస్త్రవేత్తలు

Supernova

Supernova

Supernova: ఈ విశ్వం ఎన్నో అద్భుతాలకు నెలువు. కొన్ని కోట్ల గెలాక్సీలు, అందులో కొన్ని వందల కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఇలా మన ఊహకు అందని విధంగా ఉంటుంది. అయితే ప్రతీ నక్షత్రానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. అయితే నక్షత్రాల చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతలా అంటే దాని విస్పోటనం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు కనిపిస్తుంటుంది. అంత విధ్వంసకర రీతిలో ఈ నక్షత్రాల మరణం ఉంటుంది.

Read Also: Netherlands: బీచ్‌లో సెక్స్‌.. నెదర్లాండ్స్‌లోని ఓ పట్టణంలో వ్యతిరేకంగా ప్రచారం..

తాజాగా ఇలాంటి ఓ భారీ నక్ష్రత్రానికి సంబంధించిన విస్పోటనాన్ని జపాన్ శాస్త్రవేత్తల బృందం అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ సహాయంతో గుర్తించారు. నక్షత్రం పేలుడు తర్వాత సూపర్ నోవాను గుర్తించారు. 13,824 అడుగుల ఎత్తులో హవాయిలోని మౌనా కీపై ఉన్న భారీ, ఎనిమిది మీటర్ల (26 అడుగుల కంటే ఎక్కువ) వెడల్పు గల జెమినీ నార్త్ టెలిస్కోప్ ఈ అంతరిక్ష పేలుడును గమనించింది. ‘‘SN 2023ixf’’గా పిలువబడే సూపర్నోవాను మే 19న జపాన్ ఖగోళ శాస్త్రవేత్త కొయిచి ఇటగాకి కనుగొన్నారు. గత 5 ఏళ్లలో శాస్త్రవేత్తలు గుర్తించిన అత్యంత సమీపంలోని సూపర్ నోవా ఇదే. పిన్ వీల్ గెలాక్సీ(మెస్సియర్ 101) స్పైరల్ ఆర్మ్స్ లోని ఒక నక్షత్రం పేలి సూపర్ నోవాగా మారింది.

2011లో గమనించిన టైప్ 1 సూపర్ నోవా తర్వాత గత 15 సంవత్సరాలత్లో మెస్సియర్ 101లో సంభవించిన రెండవ సూపర్ నోవా ఇదే. పిన్‌వీల్ గెలాక్సీ భూమి నుండి సుమారు 21 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉర్సా మేజర్ రాశి దిశలో ఉంది. రాత్రి పూట కనిపించే అతి తక్కువ గెలాక్సీల్లో ఇది ఒకటి. ఈ గెలాక్సీ దాదాపుగా 1,70,000 కాంతి సంవత్సరాల వ్యాసంతో ఉంది. దాదాపుగా ఒక ట్రిలియన్ నక్షత్రాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత నెలలో ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూసిన దాంట్లో అతిపెద్ద కాస్మిక్ పేలుడును గుర్తించారు. ఈ సంఘటన భూమకి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. మూడేళ్ల పాటు ఇది కొనసాగింది. ఇది మనకు తెలిసిన సూపర్ నోవా కన్నా పది రెట్లు ప్రకాశవంతంగా ఉంది.

Show comments