Site icon NTV Telugu

తాలిబన్ల ప్రభుత్వం మరో కీలక ప్రకటన !

అఫ్ఘాన్‌లో ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తోంది. తాలిబన్లు కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మూసివేశారు. దీనిపై తాలిబన్ల ప్రభుత్వం కొత్త ప్రకటనను విడుదల చేసింది. దేశంలో ఉన్న మదర్సాలు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. కాని అందులో అమ్మాయిలు ఉండరని స్ఫష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులందరూ కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అమ్మాయిలను కూడా తిరిగి చదువుకోవడానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version