Site icon NTV Telugu

Bangkok: ఘోర విషాదం.. స్కూల్ బస్సు దగ్ధమై 25 మంది విద్యార్థుల సజీవదహనం

Bangkokschoolbusfire

Bangkokschoolbusfire

బ్యాంకాక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది విద్యార్థులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనతో విద్యార్థులు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్

ఉతై థానిలోని పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకువెళ్తుండగా బస్సులో మంగళవారం మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు బస్సుల్లో మంటలు చెలరేగాయని తెలిపారు. జీర్ రంగ్‌సిట్ షాపింగ్ మాల్‌కు సమీపంలో ఇన్‌బౌండ్ ఫాహోన్ యోథిన్ రోడ్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. బస్సులో 38 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల తరపున విహార యాత్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Adani Group: అదానీ, కెన్యా మధ్య ‘రహస్య’ ఒప్పందం.. బహిర్గతం చేసిన వ్యక్తికి ప్రాణహాని!

 

 

Exit mobile version