Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- దూసుకొస్తున్న హౌతీలు
- సౌదీలో రెడ్ అలర్ట్
- బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియాలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. హౌతీలు దూకుడుగా ఉండడంతో సౌదీ హడలెత్తిపోతుంది. గత కొద్ది రోజులుగా ఎయిర్‌పోర్టులే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తోంది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక హౌతీల దాడులను సౌదీ తిప్పికొట్టలేకపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా సౌదీ అరేబియాలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. తరచుగా అత్యంత పటిష్టమైన బంకర్లకు తరలిస్తున్నట్లు వాల్ స్ట్రీల్ జర్నల్ నివేదించింది. క్షిపణులు, డ్రోన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా పంచుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా హెచ్చరించింది.
నివేదికల ప్రకారం… 41 ఏళ్ల యువరాజు దాదాపు వారం రోజులుగా బహిరంగంగా కనిపించడం లేదు. ఆయనను బంకర్లతో కూడిన, భారీ భద్రత గల తన రాజభవనాలకే పరిమితం చేశారు. హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇదిలా ఉండగా సౌదీ అరేబియా ఆరు భాషల్లో ఒక సందేశాన్ని జారీ చేసింది. క్షిపణులు, డ్రోన్లను అడ్డగించడం లేదా అవి ఎక్కడ పడతాయనే విషయానికి సంబంధించి వీడియోలు తీసినా, సమాచారాన్ని పంచుకున్నా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అరెస్టు కూడా చేస్తామని ఆ సందేశంలో స్పష్టంగా పేర్కొంది.
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!