Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్‌లోకి వెళ్లిపోయిన యువరాజు

  • దూసుకొస్తున్న హౌతీలు
  • సౌదీలో రెడ్ అలర్ట్
  • బంకర్‌లోకి వెళ్లిపోయిన యువరాజు
Saudi

Saudi

సౌదీ అరేబియాలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. హౌతీలు దూకుడుగా ఉండడంతో సౌదీ హడలెత్తిపోతుంది. గత కొద్ది రోజులుగా ఎయిర్‌పోర్టులే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తోంది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక హౌతీల దాడులను సౌదీ తిప్పికొట్టలేకపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా సౌదీ అరేబియాలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. తరచుగా అత్యంత పటిష్టమైన బంకర్లకు తరలిస్తున్నట్లు వాల్ స్ట్రీల్ జర్నల్ నివేదించింది. క్షిపణులు, డ్రోన్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా పంచుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా హెచ్చరించింది.

నివేదికల ప్రకారం… 41 ఏళ్ల యువరాజు దాదాపు వారం రోజులుగా బహిరంగంగా కనిపించడం లేదు. ఆయనను బంకర్లతో కూడిన, భారీ భద్రత గల తన రాజభవనాలకే పరిమితం చేశారు. హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇదిలా ఉండగా సౌదీ అరేబియా ఆరు భాషల్లో ఒక సందేశాన్ని జారీ చేసింది. క్షిపణులు, డ్రోన్‌లను అడ్డగించడం లేదా అవి ఎక్కడ పడతాయనే విషయానికి సంబంధించి వీడియోలు తీసినా, సమాచారాన్ని పంచుకున్నా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అరెస్టు కూడా చేస్తామని ఆ సందేశంలో స్పష్టంగా పేర్కొంది.