Pakistan-Saudi Pact: భారత్-పాక్ యుద్ధం జరిగితే, సౌదీ భారత్‌పై దాడి చేస్తుందా..? కొత్త ఒప్పందం ఏం చెబుతోంది.?
- పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం..
- ఒక దేశంపై యుద్ధం జరిగితే మరో దేశం యుద్ధం చేస్తుందా..?
- భారత్‌పై ఎలాంటి ప్రమాదం ఉంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Saudi Pact: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని అనుకోండి, పాకిస్తాన్ దారుణంగా దెబ్బతిన్నది ఊహించుకోండి, ఆ సమయంలో భారత్‌పై యుద్ధానికి సౌదీ అరేబియా వస్తుందా..? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా, పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది రెండో దేశంపై దాడిగా పరిగణించబడుతుందనేది ఒప్పందం సారాంశం. అయితే, నిజంగా భారత్‌కు వ్యతిరేకంగా సౌదీ రాయల్ ఆర్మీ భారత్‌పై యుద్ధానికి దిగుతుందా.? అంటే సందేహమే. కానీ, పాకిస్తాన్ మాత్రం మాకు అండగా సౌదీ ఉందని తెగ ఫీల్ అవుతోంది.
ఇజ్రాయిల్ టార్గెట్..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
నిజానికి ఈ ఒప్పందం భారత్ కన్నా, ఇజ్రాయిల్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఇటీవల, హమాస్ అగ్ర నాయకత్వమే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తమకు వ్యతిరేకంగా, తమ ఉనికిని ప్రశ్నించే వారి పట్ల తాము దాడులు చేస్తామని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అత్యంత మిత్రదేశమైన ఖతార్‌ను కూడా ఇజ్రాయిల్ వదలలేదు. తాజాగా, పాక్-సౌదీల ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ భారత్ కన్నా, ఇజ్రాయిల్‌నే లక్ష్యంగా చేసుకుంది.
నిజానికి, సౌదీకి భారత్‌తోనే ఎక్కువ వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నిజంగా పాకిస్తాన్‌తో భారత్ యుద్ధమే చేస్తే సౌదీ రంగంలోకి దిగుతుందనేది అనుమానమే. ఎందుకంటే, భారత్‌తో సౌదీ లెక్కలు వేరుగా ఉంది. నాటో తరహా ఒప్పందంలో ‘‘ఒకరిపై దాడి= రెండింటిపై దాడి’’ అనే పదాలు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చూస్తోంది. ఇది సౌదీతో అతిపెద్ద దౌత్యవిజయంగా ఆ దేశం పేర్కొంటోంది.
భారత్‌కి హెచ్చరిక కాదు..
అయితే, ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ భారత్‌ని లక్ష్యంగా చూస్తుంటే, సౌదీ ఇజ్రాయిల్‌ను లక్ష్యంగా చూస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు భారత్‌పై యుద్ధానికి వస్తాయనేది అర్థం కాదని అంతర్జాతీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.
సౌదీ అరేబియా భారతదేశానికి నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, భారత్ సౌదీకి రెండో అతిపెద్ద భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ద్వైపాక్షిక వాణిజ్యం USD 41.88 బిలియన్ల వద్ద ఉంది. రెండు దేశాలు లోతైన ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటాయి. ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడితే, సౌదీ అరేబియాతో వారి వాణిజ్యం కేవలం 3-4 బిలియన్ డాలర్లు మాత్రమే.
భవిష్యత్తులో భారత్-పాక్ యుద్ధమే వస్తే, సౌదీ భారత్‌తో తన సంబంధాలను ప్రమాదంలో పడేయదు. కానీ, ఇజ్రాయిల్ సౌదీపై దాడి చేస్తే మతం, రాజకీయాలు, ఒప్పందం కోసం జోక్యం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, సౌదీ అరేబియా చాలా ఏళ్లుగా పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమంపై తన ఆసక్తిని చూపిస్తోంది. నిజానికి, పాక్ అణ్వాయుధ కార్యక్రమాలకు సౌదీ నిధులు సమకూర్చినట్లు చాలా మంది నమ్ముతారు. ఇదే విషయం రిటైర్డ్ పాకిస్తాన్ జనరల్ ఫిరోజ్ హసన్ ఖాన్ రాసిన ‘ఈటింగ్ గ్రాస్: ది మేకింగ్ ఆఫ్ ది పాకిస్తానీ బాంబ్’ పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!