ప్రపంచంలోనే ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన మైక్రోసాఫ్ట్ కు కొత్త చైర్మన్‌ను నియమించింది. ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన జాన్ థాంప్సన్ స్థానంలో సత్యనాదెళ్లను నియమించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ అభివృద్దిలో సత్యనాదెళ్ల కీలకపాత్ర పోషించారు. 2014లో ఆయన్ను సీఈవోగా నియమించారు. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్యతలు చెపట్టిన తరువాత ఆ కంపెనీ మరింత వేగంగా అభివృద్ది చెందింది. సీఈవోగా వ్యహరిస్తున్న సత్యనాదెళ్లను చైర్మన్‌గా నియమించేందుకు బోర్డు ఏకగ్రీవంగా అమోదించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన జాన్ థాంప్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది.
మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్యనాదెళ్ల…

Satya Nadella Appointed As Microsoft Chairman