NTV Telugu Site icon

Cambodia: 40 ఏళ్లుగా ఒక్కరే ప్రధానమంత్రి..

Cambodia

Cambodia

Cambodia: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన మంత్రిగా.. ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు కంటిన్యూగా ఒక్కరే కొనసాగడం కష్టం. కానీ ఆ దేశానికి అతను ఏకంగా 40 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో కూడా ఆయనే తిరిగి ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏ దేశంలో అని ఆలోచిస్తున్నారా? ఇదిగో వివరాలు.. చదవండి..

Read also: Drumsticks Health Benefits: ములక్కాడలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

గత 40 ఏళ్లుగా కంబోడియా దేశానికి ప్రధానమంత్రిగా హున్ సెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇపడు మరోసారి ఎన్నికలకు సిద్ధమయ్యారు. సరైన ప్రతిపక్షమే లేని దేశంలో కంబోడియన్ పీపుల్స్ పార్టీ అధినేత హున్ సెన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు. ఈ ఆదివారం జులై 23న కంబోడియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నామమాత్రంగా జరిగే ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని హున్ సెన్ మళ్ళీ ప్రధాని పీఠాన్ని అధిష్టించి అత్యధిక కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన ప్రధానిగా రికార్డు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన పట్టుదల సంగతి అటుంచితే .. అక్కడ సరైన ప్రతిపక్షమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ నియంత పాలన కొనసాగుతుందని స్థానికులు గుసగులాడుకుంటున్నారు.

Read also: Kuno cheetahs: చీతాల మృతికి అదే కారణమా?..

గత 2018లో జరిగిన ఎన్నికల్లో హున్ సెన్ మొత్తం 125 పార్లమెంటు సీట్లకు గాను 125 సీట్లను గెలుచుకున్నారు. అయితే అప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని బలహీనమైన ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేసి గెలిచారని చెబుతుంటారు. మరికొంత మంది ఆయన రిగ్గింగ్ కు పాల్పడి గెలిచారని చెబుతుంటారు. ఏదైతేనేం చట్టసభల్లో ప్రతిపక్షం లేకుండా ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నారు హున్ సెన్. నియంత ఖైమర్ రూజ్ తర్వాత కంబోడియా ప్రధానిగా 1985లో బాధ్యతలు చేపట్టిన హున్ సెన్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసిందే లేదు. 2013లో ప్రతిపక్షాల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా 2018లో మాత్రం పూర్తిగా వారి ప్రభావం కనుమరుగైంది. దగ్గరగా నలభై ఏళ్ల హున్ సెన్ పాలనలో కంబోడియా అత్యంత వెనుకబడిన ప్రపంచ దేశాల్లో ఒకటిగా మిగిలింది.1990లో ప్రజాస్వామ్య హోదా దక్కించుకున్న కంబోడియాలో ఈ సారైనా ప్రతిపక్షంలో ఎవరో ఒకరు కూర్చుంటారని ఆశిస్తున్నారు స్థానిక ప్రజలు. ప్రతిపక్షంలో ఎవరు కూర్చున్నా ప్రధానిగా మాత్రం హున్ సెనే ఎన్నిక కావుతారని మీడియా వర్గాలు చెబుతున్నాయి.