NTV Telugu Site icon

Salmonella Outbreak: అమెరికాలో సాల్మొనెల్లా వ్యాప్తి.. ఉల్లిపాయలే కారణం..

Salmonella Outbreak

Salmonella Outbreak

Salmonella Outbreak: అమెరికాను సాల్మొనెల్లా బ్యాక్టీరియా కలవరపెడుతోంది. సాల్మొనెల్లా వ్యాప్తి 22 అమెరికా రాష్ట్రాల్లో 73 మందిని ప్రభావితం చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) ప్రకారం ఈ వ్యాప్తికి ముక్కలుగా చేసిన ఉల్లిపాయాలు కారణమవుతున్నాయని తేలింది. ఇప్పటి వరకు 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటే అవకాశం ఉందని, చాలా మంది ప్రజలు పెద్దగా వైద్య పరీక్షలు లేకుండా కోలుకోవడంతో ఖచ్చితమైన సంఖ్యను గుర్తించలేదు.

Read Also: Mahua Moitra: మహువా మోయిత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఆమె విదేశీ పర్యటనలపై ఆరా తీసే అవకాశం..

కాలిఫోర్నియాకు చెందిన గిల్స్ ఆనియన్స్ అనే కంపెనీ డైస్ చేసిన ఎల్లో ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు, ఉల్లిపాయలను, సెలెరీల ప్యాకెట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున గిల్స్ ఉల్లిపాయలను స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. అరిజోనా, కాలిఫోర్నియా, ఇడాహో, మోంటానా, ఒరెగాన్, వాషింగ్టన్ ఆరు రాష్ట్రాలకు సరఫరా చేయబడిన ఉత్పత్తుల వినియోగించే తేదీ ఆగస్టు 2023కు మించి ఉన్నాయి, దీంతో స్టోర్లలో ఇకపై అందుబాటులో ఉండవని కంపెనీ తెలిపింది.

రీకాల్స్ చేసిన ఉల్లిపాయలను తినవద్దని సీడీఎస్ ప్రజలకు సూచించింది. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియి ముఖ్యంగా పేగు వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అతిసారి, జ్వరం, కడుపులో మంట వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా సాలొనెల్లా సోకిన వారికి టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. కలుషిత ఆహారం తిన్న ఆరు గంటల నుంచి ఆరు రోజుల్లోగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతాయి.