NTV Telugu Site icon

Shiveluch Volcano Erupts: రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం.. విమానాలకు రెడ్ అలర్ట్

Shiveluch Volcano Erupts

Shiveluch Volcano Erupts

Shiveluch Volcano Erupts: రష్యాలో షివేలుచ్ అగ్నిపర్వతం బద్ధలైంది. ప్రపంచంలో అత్యంత చురకైన అగ్నిపర్వాతాల్లో షివేలుచ్ ఒకటిగా ఉంది. ఇది మంగళవారం పేలినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలోని ఈ అగ్నిపర్వతం భారీ ఎత్తున బూడిదను వెడజల్లుతోంది. పేలుడు తర్వాత బూడిద ఆకాశంలో చాలా ఎత్తు వరకు వ్యాపించింది. అర్థరాత్రి తర్వాత విస్పోటనం చెంది సుమారు 6 గంటల వరకు యాక్టివ్ గా ఉందని రష్యా తెలిపింది.

Read Also: TMC: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి లూయిజిన్హో ఫలేరో..

రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క జియోఫిజికల్ సర్వే యొక్క కమ్చట్కా బ్రాంచ్ ప్రకారం బూడిద మేఘం 108,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనికి సమీపంలో ఉన్న గ్రామాల్లో ప్రజాజీవితం స్తంభించి పోయింది. పెద్ద ఎత్తున బూడిదతో కప్పబడ్డాయి. అగ్నిపర్వతం నుంచి లావా వెదజల్లడంతో సమీపంలోని మంచు కరుగుతోంది. దీంతో బురద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విస్పోటనం తర్వాత విమానాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రష్యా ఏవియేషన్ అథారిటీ రోసావియాట్సియా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. బూడిద మేఘాలు దాదాపుగా 15 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు ప్రభావితం కావచ్చని ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రస్తుతం అగ్నిపర్వతం చుట్టుపక్కట ఉన్న మూడు గ్రామాలు – క్లియుచి, కోజిరెవ్స్క్ మరియు మేస్కోయ్ చాలా ప్రభావితం అయ్యాయి. అక్కడి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కమ్చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ కోరారు. పాఠశాలలు మూసేస్తున్నట్లు ప్రకటించారు. షివేలుచ్ అగ్నిపర్వతం 60,000-70,000 ఏళ్ల పురాతన అగ్నిపర్వతం.

Show comments