ఉక్రెయిన్ లో రష్యా సైన్యం కీలక పోరు జరుపుతున్నది. ఎలాగైన ఉక్రెయిన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నం చేస్తున్నది. అయితే, రష్యా బలగాలను పూర్తి స్థాయిలో నిలువరించలేకపోయినా కొంతవరకైనా నిలువరించేందుకు ఉక్రెయిన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా సైన్యంపై ఉక్రెయిన్ సైనికులు ధీటుగా జవాబిచ్చేందుకు సిద్దమౌతున్నారు. ఈనేపథ్యంలో రష్యా సైనికులపై కాల్పులు జరుపుతున్నారు. కీవ్ గగనతలంపైకి వచ్చిన రష్యా జెట్ ఫైటర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది. ఉక్రెయిన్ సైనికుల దాడిలో సుమారు 450 మంతి రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ పేర్కొన్నది. కేవలం సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నామని చెప్పిన రష్యా ఇప్పుడు సామాన్య పౌరుల నివాసాలపై కూడా దాడులు చేస్తున్నట్టు ఉక్రెయిన్ పేర్కొన్నది.
Ukraine Crisis: రాజధాని కీవ్‌కు చేరువలో రష్యా సైన్యం… ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైన్యం…
