Site icon NTV Telugu

Russia-Ukraine: స‌రిహ‌ద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌… ఏ క్ష‌ణంలో అయినా…

ర‌ష్యా ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు నానాటికీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌కు స‌మీపంలో ఉన్న బెలార‌స్‌లో ర‌ష్యా త‌న సేన‌ల‌ను భారీ ఎత్తున మోహ‌రిస్తున్న‌ది. క్రిమియా, ప‌శ్చిమ ర‌ష్యా ప్రాంతంలో ర‌ష్యా త‌న బ‌ల‌గాల‌ను పెంచింది. అంతేకాదు, ఉక్రెయిన్‌కు 45 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌రెచిస్టాలో పెద్ద సంఖ్య‌లో బ‌ల‌గాల‌ను త‌ర‌లించింది ర‌ష్యా. ప‌శ్చిమ ర‌ష్యాలో ఉక్రెయిన్‌కు 110 కిలోమీట‌ర్ల దూరంలో ర‌ష్యా బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి ర‌ష్యా బ‌ల‌గాలు చుట్టుముట్టాయి. దీంతో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారాయి.

Read: Maruti EV: భార‌త మార్కెట్లోకి మారుతి సుజుకీ ఎల‌క్ట్రిక్ కారు… ధ‌ర ఎంతంటే…

ర‌ష్యా ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ను త‌గ్గించేందుకు అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌య‌త్నించింది. అయితే సాధ్యం కాలేదు. దీంతో జ‌ర్మ‌నీ రంగంలోకి దిగింది. ఈరోజు జ‌ర్మ‌నీ చాన్స్‌ల‌ర్ ఈరోజు ఉక్రెయిన్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. రేపు ర‌ష్యాలో ప‌ర్యటించి రాజీ కుదిర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఉక్రెయిన్‌, ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రిగితే దాని వ‌ల‌న యూరప్ భారీగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. అందుకే పరిస్థితులు దిగ‌జార‌క ముందే రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను నివారించాల‌ని ప్ర‌పంచ‌దేశాలు చూస్తున్నాయి.

Exit mobile version