Site icon NTV Telugu

Russia-Ukraine conflict: రష్యా డిఫెన్స్‌కు షాక్..!

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది.. అయితే, యుద్ధం కంటే ముందుగా.. సైబ‌ర్ దాడి రూపంలో ఉక్రెయిన్‌పై విరుచుకుపడినట్టు తెలుస్తోంది.. సైబ‌ర్ అటాక్‌లు, హ్యాకింగ్ చేయ‌డంలో ర‌ష్యా సాంకేతిక ప‌రిజ్ఞానం అపారం అనేది ఓపెన్‌ సీక్రెట్.. ర‌ష్యా సైబర్ దాడుల‌తో ఉక్రెయిన్ బ్యాంకింగ్ వ్యవ‌స్థ కుప్పకూలిపోయింది.. ప్రభుత్వ వెబ్ సైట్‌లు అన్నీ హ్యాక్ అయ్యాయి.. ఫ‌లితంగా ఉక్రెయిన్ జ‌న‌జీవ‌నం స్తంభించి పోయింది.. ఏటీఎంల నుంచి క‌రెన్సీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేసినట్టు వార్తలు వచ్చాయి.. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోన్న సమయంలో.. రష్యాలో అధికారిక వెబ్‌సైట్లపై సైబర్‌ అటాక్ జరిగినట్టు కొన్ని కథనాలు వచ్చాయి.. ముఖ్యంగా రష్యా డిఫెన్స్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైనట్టు ఆ కథనాల సారాశం. మిలిటరీ సైనికుల, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.. అయితే, ఈ ప్రచారాన్ని రష్యా ఖండించింది.

Read Also: CPI Narayana: బిగ్‌బాస్‌ షోపై సంచలన వ్యాఖ్యలు.. అదో అధికారిక వ్యభిచార గృహం..!

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్ హ్యాక్ చేయబడినట్టు వస్తున్న వార్తలను ఖండించింది.. మిలిటరీ సైనికుల, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల వ్యక్తిగత డేటాను వెబ్‌సైట్ సర్వర్లు నిల్వ చేయవని మంత్రిత్వ శాఖ తెలిపింది.. రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి, ఏజెన్సీ సిబ్బంది వ్యక్తిగత డేటాను దొంగిలించారని ఆరోపించిన అనామక హ్యాకర్ల బృందం ఉక్రెయిన్ విజయం కోసం సోషల్‌ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం నవ్వు తెప్పిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.. రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఇంటర్నెట్ పోర్టల్ యొక్క అన్ని హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లు యథావిథిగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.. మిలిటరీ సైనికులు మరియు ఇతర రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల వ్యక్తిగత డేటాను వెబ్‌సైట్ సర్వర్లు నిల్వ చేయవని.. ఇది రష్యన్ చట్టం ఎప్పుడో నిషేధించిందని.. ఇది ఉక్రేనియన్లకు తెలియదని పేర్కొంది.

Exit mobile version