NTV Telugu Site icon

Fake Astronaut Scams: వ్యోమగామినంటూ వల.. భూమికి తిరిగిరాగానే పెళ్లంటూ లక్షలు గుంజాడు..

Astronaut

Astronaut

ఇది మోసగాళ్ల కాలం.. అయినవాళ్లను నమ్మేలా లేదు.. బయటివారిని చేరదీసేలా లేకుండా పోయింది.. ఎందుకంటే.. వారి మాటల్లో నిజమెంత.. కపటం ఎంత అనేది.. పసిగట్టలేని పరిస్థితి.. ఇక, సోషల్‌ మీడియా ఎంట్రీతో.. అది తారాస్థాయికి చేరింది.. మరోకరి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసేవారు.. తనకు తానుగా మంచి స్థానంలో ఉన్నానని పరిచయం చేసుకుని.. బురిడీ కొట్టించేవారు.. ఇలా ఎంతో మంది కాచుకు కూర్చుకున్నారు.. తాను వ్యోమగామినంటూ వృద్ధురాలికి వల విసిరి.. అందినకాడికి దండుకున్న ఓ కేటుగాడు వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది.. తాను రష్యా వ్యోమగామి.. ప్రస్తుతం అంతరిక్షంలో అంతర్జాతీయ స్పేస్ సెంటర్ ఉన్నాను అంటూ.. జపాన్‌లో ఓ వృద్ధ మహిళకు మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి.. తాను స్పేస్‌ సెంటర్‌ నుంచి భూమికి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు.. అదంతా నిజమేనని నమ్మిన 65 ఏళ్ల మహిళ.. అతడు అడిగినప్పుడల్లా డబ్బులు సమకూర్చింది.. ఇలా ఆమె నుంచి దాదాపు రూ.25 లక్షల వరకు గుంజాడు ఆ కేటుగాడు.

Read Also: Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మెడికల్ రీఎంబర్స్‌మెంట్ గడువు పొడిగింపు

సోషల్‌ మీడియాలో పరిచయమైన ఆ వృద్ధ ప్రేమికురాలి విషయానికి వస్తే.. సదరు మహిళ జపాన్‌లోని షిగా రాష్ట్రంలో నివాసం ఉంటుంది.. అయితే, జూన్‌లో వ్యోమగామి పేరుతో ఓ కేటుగాడు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. స్పేస్ సూట్ ధరించి ఉన్న అతడి ఫొటోలు చూసిన ఆ వృద్ధురాలు అతడు నిజంగానే వ్యోమగామి అని నమ్మేసింది.. క్రమంగా వారి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతూ పోయింది.. ‘లైన్’ అనే జపాన్ మెసేజింగ్ యాప్ ద్వారా వీరి సంభాషణలు జరిగేవి.. కొన్ని రోజుల తర్వాత తన కంత్రీ ఐడియాను అమలు చేసిన కేటుగాడు.. లవ్ ప్రపోజల్ ఆ వృద్ధురాలి ముందు ఉంచాడు.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. జపాన్‌లో నీతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని ఉందంటూ.. ఆమెకు ఊసులు చెప్పాడు.. పూర్తిగా తనను తమ్మిందనే నిర్ధారణకు వచ్చిన ఈ ఫేక్‌గాడు.. తాను ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి రావాలంటే రాకెట్ ఫీజు చెల్లించాలి.. అందుకు నాకు డబ్బులు కావాలని సందేశం పంపాడు. అది నిజమేనని నమ్మిన ఆ వృద్ధ మహిళ ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 5 మధ్యలో పలు దఫాలుగా దాదాపు 4.4 మిలియన్‌ యెన్‌లు అంటే సుమారు రూ.25 లక్షల వరకు డబ్బు పంపించింది… భూమికి తిరిగి రావడానికి అయ్యే ఖర్చులో జపాన్‌కు వెళ్లేందుకు రాకెట్‌ను కొనుగోలు చేసేందుకు అయ్యే డబ్బు కూడా ఉందని చెప్పాడు.. 25 లక్షలు వసూలు చేసినా వాడిలో ఆశ చావలేదు.. ఇంకా డబ్బు అడుగుతూనే ఉండడంతో.. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతగాడు నకిలీ వ్యోమగామి అని ప్రాథమిక విచారణలో తేల్చారు..