NTV Telugu Site icon

Thailand: బీచ్ ఒడ్డున ధ్యానం.. భారీ కెరటానికి కొట్టుకుపోయిన రష్యన్ హీరోయిన్.. వీడియో వైరల్

Kamillabelyatskaya

Kamillabelyatskaya

చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. ఎప్పుడు ఎలా ప్రాణాలు పోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ మధ్య కర్ణాటకలోని మంగుళూరు రిసార్ట్‌లో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్‌లోకి ఈత కొట్టేందుకు దిగి ఊపిరాడక విగతజీవులుగా మారారు. తాజాగా రష్యన్ బ్యూటీ సముద్ర ఒడ్డున ధ్యానం చేస్తుండగా ఒక్కసారిగా భారీ కెరటం దూసుకొచ్చి లాక్కెళ్లిపోయింది. అందరూ చూస్తుండగానే శవంగా మారిపోయింది. ఈ ఘోర విషాదం థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది.

24 ఏళ్ల రహ్యన్ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తోంది. కోహ్ సుముయ్ ద్వీపంలో ఉన్న రాళ్లపై కూర్చుని ధ్యానం, యోగా చేస్తోంది. ప్రశాంతంగా ఆమె ధ్యానంలో మునిగిపోయింది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ కెరటం దూసుకొచ్చింది. ఆమె కూర్చున్న చోటు దగ్గరకే అలలు రావడంతో సముద్రంలోకి లాక్కుపోయింది. సమీపంలో ఉన్న వాళ్లంతా ఆమెను పరిశీలిస్తూ మొబైల్‌లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఒకరు ఆమెను రక్షించేందుకు కూడా ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కొద్దిసేపటికి ఆమె శవమై ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ధ్యానానికి ముందు ఆమెకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ధ్యానం కోసం తీసుకెళ్లిన వస్తువులన్నీ సముద్రంలో తేలియాడిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఆమె అలల్లో కొట్టుకుపోతుండగా ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.. కానీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. ధ్యానం చేస్తున్న రాతి నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం నుంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి థాయ్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లిందని, అంతకుముందు కూడా అదే స్థలంలో ధ్యానం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్వీపం దగ్గరకు వెళ్లొద్దని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. పర్యాటకులు మాత్రం పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కెమిల్లా బెల్యాట్స్కాయ‌కు ఈ ద్వీపం అంటే చాలా ఇష్టమని తన పోస్టులో పేర్కొంది.

 

Show comments