Six months into the Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి ఆరు నెలలు గడుస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాలు ప్రతీ రోజు దాడులు చేసుకుంటున్నాయి. రష్యా దళాల నుంచి ఉక్రెయిన్ సేనలు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్.. అమెరికా, యూరప్ దేశాల నేతృత్వంలోని నాటో సైనిక కూటమిలో చేరేందుకు సిద్ధం అయిన తరుణంలో రష్యా, ఉక్రెయిన్ పై ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనలేదు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది.
ఉక్రెయిన్ దేశానికి పాశ్చత్య దేశాల నుంచి నాటో కూటమి, అమెరికా దేశాల నుంచి సైనిక, ఆయుధ, వ్యూహాత్మక సహాయం అందుతుండటంతో రష్యాకు ఎదురొడ్డి పొరాడుతోంది. బలమైన రష్యా ముందు కేవలం కొన్ని వారల వ్యవధిలోనే మోకరిల్లుతుందని అనుకున్న ఉక్రెయిన్ ఆర నెలలుగా రష్యాతో ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే తాజాగా యుద్ధం ఆరు నెలలకు చేరిన సందర్భంలో బుధవారం రోజున ఉక్రెయిన్ కు మరో 3 బిలియన్ల డాలర్ల సైనిక సహాయాన్ని ప్రకటించింది అమెరికా. అయితే రష్యాను నిలువరించేందుకు పాశ్చాత్య దేశాలు చేస్తున్న కుట్రలో ఉక్రెయిన్ బలిపశువు అయ్యిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also: Hyderabad Old City Protests: రాజాసింగ్ బెయిల్ పై హీటెక్కిన పాతబస్తీ.. భారీ భద్రత
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్క్ స్కీ రష్యా నుంచి తమ దేశాన్ని కాపాడాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తున్నారు. రష్యాపై మరన్ని ఆంక్షలు విధించాలని పలు దేశాలను కోరుతున్నారు. ఇప్పటికే రష్యాపై పాశ్చాత్య దేశాలు పలు ఆర్థిక ఆంక్షలను విధించాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకుంటున్నాయి. అయినా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, మరియోపోల్, ఎల్వీవ్, సుమీ వంటి నగరాలను రష్యా లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేసింది. ప్రస్తుతం ఉక్రెయన్ తూర్పు ప్రాంతం నుంచి రష్యా దాడులు చేస్తోంది.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. ఆహార సంక్షోెభం ఏర్పడుతోంది. దీంతో పాటు అణు ప్రమాదం పొంచి ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధం వల్ల యూరప్ లోనే అతిపెద్దదైన జపోరిజ్జియా అణు విద్యుత్ కర్మాగారం ప్రమాదం అంచున ఉంది. ఈ అణు కర్మాగారం పేలితే..మరో చెర్నోబిల్ తరహా ఘటన పునరావృతం అవుతుంది. అందుకే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఈ యుద్ధం మరెన్ని రోజులు జరుగుతుందో తెలియదు.
