Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడికి పాల్పడుతోంది. ఇటీవల వరసగా రాకెట్లతో విరుచుకుపడుతోంది. గడిచిన మూడు రోజుల్లో దాదాపుగా 40కి పైగా మంది రష్యా దాడిలో మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న సైనిక చర్యగా ప్రారంభం అయిన రష్య, ఉక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారింది. ఇటీవల రష్యా, ఉక్రెయన్ తూర్పు భాగాలు డోన్ బాస్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. తూర్పు ప్రాంతంలోని అనేక పట్టణాలను, నగరాలపై వరసగా దాడులు చేస్తూ రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇటీవల ఇది మరింతగా పెరిగింది. పాశ్చాత్య దేశాలు మాత్రం ఉక్రెయిన్ ను రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్లాన్ లో ఉందని ఆరోపిస్తున్నారు.
గురువారం రష్యా జరిపిన రాకెట్ దాడిలోొ రాజధాని కీవ్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్నిట్సియా నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ధ్వసం అయ్యాయి. ఈ దాడిలో 23 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో నాలుగేళ్ల బాలిక కూడా మరనించింది. ఈ దాడిపై పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ సాయుధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు విదేశీ ఆయుధ సరఫరాదారులతో సమావేశం అయ్యారనే ఆరోపణ మధ్య ఈ దాడిని జరిపింది. శుక్రవారం రష్యా దళాలు నికోలపోల్ కు ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్నిప్రో నగరంపై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. 15 మంది వరకు గాయపడ్డారు. రష్యా డ్నిప్రో ప్రాంతంలోని క్షిపణి విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
Read Also: ITBP Jawan: ముగ్గురు సహచరులపై కాల్పులు.. అనంతరం తనను తాను కాల్చుకుని..
దీంతో పాటు ఖార్కివ్ ప్రాంతలోని ఈశాన్య పట్టనం చుహుయివ్ పై కూడా రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు మాత్రం రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడిని నివారించేందుకే దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. దాదాపుగా ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఉక్రెయిన్ ను నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ తో పాటు రాజధాని కీవ్ యుద్ధం వల్ల నష్టపోయాయి. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి వలసలు పెరిగాయి. సమీప దేశాలైన పోలాండ్, రొమేనియాలకు ప్రజలు వలసపోతున్నారు.
