ఉక్రెయిన్ రష్యా మధ్య పరిణామాలు దిగజారుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రష్యా బోర్డర్‌లోకి ప్రవేశించారని ఐదుగరు ఉక్రెయిన్ సైనికులను కాల్చి చంపింది రష్యా సైన్యం. తాము ఉక్రెయిన్ పై దాడి చేయమని చెబుతూనే, ఉక్రెయిన్‌ను విలీనం చేసేకోవడానికి పావులు కదుపుతున్నారు పుతిన్. చరిత్రను సాక్ష్యంగా చూపిస్తూ ఉక్రెయిన్‌ను వీలీనం చేసుకోవడానికి సిద్ధమౌతున్నట్టు తెలస్తున్నది. ఉక్రెయిన్, రష్యాలు వేరువేరు దేశాలు కాదని, 9 శతాబ్దం నుంచి రుస్ అనే స్కాండినేవియన్ ప్రజలు చరిత్రను గుర్తుచేశారు. గతంలో క్రిమియాను ఆక్రమించుకున్న సమయంలో కూడా పుతిన్ ఇదేవిధమైన చరిత్రను గుర్తు చేసుకున్నారు.
Read: MLC Pochampally: మండల, జిల్లా పరిషత్‌ల గ్రాంట్లు పెంచాలి
అసలు ఉక్రెయిన్ అన్నది ఒక దేశం కాదని, ఎప్పుడూ కూడా అది స్థిరంగా ఉండలేదని పుతిన్ పేర్కొన్నారు. ఇప్పటికే డాన్‌బాస్ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా ప్రకటించారు. మరోవైపు నాటో ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా భారీ సంఖ్యలు ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్నది. 1954 ను క్రిమియాను అప్పటి రష్యా అధ్యక్షుడు కృశ్చేవ్ ఉక్రెయిన్‌కు బహుమతిగా ఇచ్చారని చరిత్ర చెబుతున్నది. అయితే, క్రిమియాలో రష్యా భాషను మాట్లాడే ప్రజలు, రష్యా మూలాలున్న ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. దింతో క్రిమియాను రష్యాలో భాగమే అని చెప్పి 2014లో ఆక్రమించుకున్నారు.
