Site icon NTV Telugu

తాలిబ‌న్ల కోసం రంగంలోకి దిగిన ర‌ష్యా… వారితో చ‌ర్చ‌ల‌కు సిద్ధం…

తాలిబ‌న్లకు బ‌గ్లాన్ ప్రావిన్స్ కొర‌కరాని కొయ్య‌గా మారింది.  2001 కి ముందు కూడా ఈ ప్రావిన్స్‌లోకి తాలిబ‌న్లు అడుగుపెట్ట‌కుండా అప్ప‌టి స్థానిక ద‌ళాలు అడ్డుకున్నాయి.  తీవ్రంగా పోరాటం చేశాయి.  ఇప్పుడు కూడా ఈ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్ట‌నివ్వ‌కూడ‌ద‌ని స్థానిక ద‌ళాలు నిర్ణ‌యం తీసుకొని పోరాటం చేస్తున్నాయి.  ఇప్ప‌టికే మూడు జిల్లాల‌ను తాలిబ‌న్ల చెర నుంచి విడిపించారు. అయితే, తాలిబ‌న్లు కాబూల్ ఆక్ర‌మ‌ణ త‌రువాత శాంతిని కోరుకుంటున్నామ‌ని, అంద‌రినీ క్ష‌మించివేశామ‌ని చెబుతున్నారు.  అయిన‌ప్ప‌టికీ తాలిబ‌న్ల మాట‌ల‌ను అక్క‌డి ప్ర‌జ‌లెవ‌రూ కూడా న‌మ్మ‌డం లేదు.  ఇక ఇదిలా ఉంటే, పంజ్‌షీర్‌లోని స్థానిక ప్ర‌తిఘ‌ట‌న ద‌ళాల‌తో తాలిబ‌న్ల త‌ర‌పున తాము చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని కాబూల్‌లోని ర‌ష్యా కార్యాల‌యం పేర్కొన్న‌ది.  పంజ్‌షీర్‌లోని తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక ద‌ళాల‌కు తాలిబ‌న్లు ఓ డీల్ ఇచ్చారు.   ఆ డీల్‌కు ఆమోదం తెలిపేవిధంగా రష్యా రంగంలోకి దిగి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఒక‌వైపు శాంతి మంత్రం ప‌ఠిస్తూనే తాలిబ‌న్లు త‌మ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక ద‌ళాల కోసం సెర్చ్ ఆప‌రేష‌న్ చేస్తున్న‌ది.  ఇప్ప‌టికే పంజ్‌షీర్ ప్రాంతంలోని బ‌గ్లాన్ ప్రావిన్స్‌లో న‌లుగురు చిన్నారుల‌తో స‌హా ముగ్గురు మ‌హిళ‌ల‌ను తాలిబ‌న్లు కాల్చిచంపారు.  

Read: రేప‌టి నుంచి తెలంగాణ‌లో ప్ర‌తి ఒక్క‌రికి కోవిడ్ వ్యాక్సిన్‌…

Exit mobile version