Site icon NTV Telugu

Russia: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సంచలన ప్రకటన..

Russia Ukraine War

Russia Ukraine War

Russia Says Shot Down 4 US-Made Missiles, 1st Such Claim Since Ukraine War: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. రష్యా ఏకపక్షంగా యుద్ధాన్ని ముగించేలా కనిపించడం లేదు. ఇక ఉక్రెయిన్ కూడా వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంలో రష్యాతో పోరాడుతోంది. అయితే యుద్ధం వల్ల ఉక్రెయిన్ దేశం సర్వనాశనం అవుతోంది. రష్యా, అమెరికాల వివాదం మధ్య ఉక్రెయిన్ యుద్ధ భూమిగా మారుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలపై మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ దిగిపోతేనే చర్చలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే అవకాశం కనిపించడం లేదు.

Read Also: Pathan row: దీపికా ప్లేసులో సీఎం యోగి ఫోటో మార్ఫింగ్.. తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం

ఉక్రెయిన్ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా దాడులు ప్రారంభించింది. 10 నెలల ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఏనాడు చేయని విధంగా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ రష్యా ప్రాంతంలో తమ వైమానిక వ్యవస్థ నాలుగు అమెరికా తయారీ క్షిపణులను కూల్చేసినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అమెరికా విషయంలో రష్యా ఇలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా తయారు చేసిన ‘HARM’ యాంటీ-రాడార్ క్షిపణులను కాల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బెల్గోరోడ్ ప్రాంతంలో నాలుగు యాంటీ రాడార్ క్షిపణులను కూల్చేశామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సోషల్ మీడియాలో ఓ ప్రకటనలో పేర్కొంది. యుద్దం ప్రారంభం అయినప్పటి నుంచి ఉక్రెయిన్ ఈ ప్రాంతంపై దాడులు చేస్తోంది.

Exit mobile version