Site icon NTV Telugu

Ukraine Crisis: ర‌ష్యా ర‌క్ష‌ణ‌శాఖ కీల‌క నిర్ణ‌యం

ర‌ష్యా ఉక్రెయిన్‌ల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు రోజు రోజుకూ మారిపోతున్నాయి. అమెరికా ఇంటిలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈనెల 16 న ఉక్రెయిన్‌పై దాడికి దిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారాయి. అటు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు కూడా ఇదే విష‌యాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ‌కు ఉక్రెయిన్‌పై దాడికి దిగే ఉద్దేశం లేద‌ని ర‌ష్యా చెబుతున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోడం లేదు. ఇక ఇదిలా ఉంటే, ర‌ష్యాబోర్డ‌ర్‌లోని కొన్ని ద‌ళాలు వెన‌క్కి వ‌చ్చేశాయి. ఈ విష‌యాన్ని ర‌ష్యా ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌క‌టించింది.

Read: Shocking Makeover: మొన్న‌టి వ‌ర‌కు కూలి… నేడు కేర‌ళ రోల్ మోడ‌ల్‌…

అయితే, ఎంత మందిని వెన‌క్కి ర‌ప్పించింది అన్న‌దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేరు. ఉద్రిక్త‌త‌ను త‌గ్గించేందుకు బ‌ల‌గాన‌ల‌కు వెన‌క్కి త‌ప్పించిందా లేదంటే మ‌రేదైనా నిర్ణ‌యం తీసుకోబోతుందా అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది. ఇక ఇదిలా ఉంటే, ప్ర‌స్తుతం జ‌ర్మ‌నీ చాన్స్‌ల‌ర్ ఉక్రెయిన్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. అనంత‌రం, ర‌ష్యాలో ప‌ర్య‌టించి పుతిన్‌తో చ‌ర్చిస్తారు. ఉద్రిక్త‌త‌ల‌ను నివారించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఉక్రెయిన్‌లో ప‌లు దేశాలు రాయ‌బార కార్యాల‌యాల‌ను తాత్కాలికంగా మూసివేసింది. విమానాల‌ను ర‌ద్దు చేసింది. ఇండియా సైతం ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను వెన‌క్కి రావాల్సిందా ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version